ఆగమములు
ఆగమములనగా వచ్చి చేరుట అని అర్థం. వీటిని శివుడు మొదటగా పార్వతీదేవికి ఉపదేశించుట జరిగినది. ఇవి వేదాలతో బాటు ప్రాచీనమైనవి. వీటిని ఆవిర్భూతాలని అంటారు. ఆగమములు వైదికము, తాంత్రికము అని కలవు. శైవాగమములు వైదిక ఆగమములుగా చెప్పబడతాయి. ఎంతో విశేషత కలిగిన ఈ ఆగమములలో వీరశైవము - సిద్దాంతము - దీక్ష - ఆచరణ గూర్చి విశేషంగా కలదు. అంతేగాక ఈ ఆగమ సిద్దాంతాల ఆధారంగానే వీరశైవపు పెక్కు గ్రంధాలు వెలువరించబడినవి.
ఆగమాల ప్రస్తావన పెక్కు పురాణాలలో కనిపిస్తుంది. అంతేగాక శ్వేతాశ్వరాది ఉపనిషత్తులలోని శ్లోకాలు విషయమూ ఆగమములలో కూడా కలవు. భగవద్గీతలోని చాలా శ్లోకాలు ఆగమములోనివిగా (ఎక్కువగా పారమేశ్వరాగామము నుండి) అగుపిస్తాయి. కొన్ని శ్లోకాలు యథాతతంగానూ మరికొన్ని కొద్ది మార్పులతోనూ కలవు.
ఆగములను ప్రాచీనులైన కాళిదాసాది పండితులు తమ రచనలలో ఆగమ విషయ ప్రస్తావన చేయడం ఇవి చారిత్రకంగానూ బహు పురాతణమని తెలియదగును.
ప్రాచీన కాలంలో వేదపరంగా ఆచరణాధికాలు ఉండేవి, కాని ప్రస్తుతం హిందూమతం యావత్తు ఈ ఆగమ శాస్త్రం ప్రకారమే నడుస్తుందని చెప్పవచ్చు. మనం నిత్యం ఆచరించే పద్దతులు, పూజా విధానాలు, దేవాలయాలు - వాటి పూజాధికాలు, పండుగలు ఇత్యాది ఎన్నో ఆగమ యుతంగా నడుస్తున్నాయి.
వేదములు కర్మను ప్రధానంగా భోదిస్తాయి, ఉపనిషత్తులు జ్ఞాన బోధకములు, కాగా ఆగమములు కర్మజ్ఞాన సముచ్చయక భోదములు. కేవల తత్వ జ్ఞానమునే కాక ఉపాసనాధి క్రియల తెలిపి జీవులకు ముక్తిని ప్రసాదించు నట్టివి - కావున అందరికీ ఆచరనీయమైనవి.
Agama Shabdaartham
Aagatha Shiva Vaktrebhyah, Gathasthu Girijaa Mukham !
Maheshwara Thathva Kathaanaadaagamah Kathitho Dvija !! (Kaaranagama)
పరమశివుని పంచ ముఖముల నుండి వెలువడి పార్వతి మరియు బ్రహ్మాదులచే గ్రహించబడినవి. ఇవి పరమేశ్వరుని పరతత్వ భోధకములు.
Agamas - Vaideekam
"Shivaagama Midam Punyam Shruthimoolam Vimukthidame
Tasmath Sadaa Sevaneeyam" (Kaamikaagamam)
శివాగామములు పుణ్యమైనవి వేద మూలకములు. ఇవి ముక్తిదాయకములైనందున వీటిని సదా సేవించవలయును.
What is in Agamas
Aachaara KathanaathDivyagathi Praapthi Vidhaanathahv !
Mahesha Thathva KathanaathAagamah Kathithah Priye !! (Kiranaagama)
ఆగమములలో శైవాచారాలు, శివదీక్షాది విధులు, మోక్ష సాధకములైన శివలింగాది పూజాధికాలు, మహేశ్వర తత్వ ప్రతిపాదకుమలైన విషయములు ఉండును.
ఆగమ శాస్త్రములు 2 విధాలు:
1) శైవాగమాలు 2) శాక్తేయ ఆగమాలు (శాక్తేయ ఆగమాలను తంత్ర ఆగమాలు అని కూడా అంటారు )
వీటిలో దేవతామూర్తుల నిర్మాణం, దేవాలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్టలు,
పూజోపాసనాది క్రియలతో కూడుకొని ఉండును.
శాక్తేయ (తంత్ర) ఆగమాలు 64 కలవు, వీటిలో శాక్త పద్దతుల సిద్దాంతాల గూర్చి
వివరంగా తెలుపబడి ఉండును. ఇవి పరాశాక్తియైన పార్వతికి సంబందించినవి.
Shaiva Agamas
శైవాగమాలు
28 కలవు. ఈ 28 ఆగమాలను అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత పరంగా కూడా విభాగించ బడ్డవి.
క్రియాపాద, చర్యపాద, యోగపాద, జ్ఞానపాద అనే నాలుగు పాదములు
పతి, కుండలిని, మాయ, పశు, పాశ, దీక్ష అనే షట్పదార్థములు తెలియజేయబడి ఉండును. .
గురుముఖమున నిర్గతమగుజ్ఞానము, ప్రత్యక్షాది పదార్థరూప జ్ఞేయము, లింగార్చనా లక్షణమగు అనుష్టేయము, భస్మధారణాత్మకమగు అధికృతము, శివమంత్ర రూపమగు సాధనము, శివ సమానతా ముక్తి రూపమగు సాధ్యము అనే షట్పదార్థములు తెలియజేయబడి ఉండును.
శివుని సగుణ, నిర్గుణ ఉపాసనల వివరించునవే శైవాగమములు. ఇవి పూర్తిగా శైవ సిద్దాంతాలను, పద్దతులను, దీక్షాది విధులను, ఆలయ నిర్మాణ, నిర్వాహణాది విషయాలను భొదించును. ఇవి సమస్త శైవులందరికీ ప్రధానమైనవి. పార్వతీదేవి సందేహాల నివృత్తి చేస్తూ శివునిచే భోదించబడెను. ఈ ఆగమాలను వేరు వేరు మహాత్ములు విని ప్రచారము చేశారు.
ఆగమాలు పరమేశ్వరుని పంచముఖాలచే భోదించబడెను:
Kaamikaadya Jitaanthashcha Sadyojaatha Mukhodbhavaah
Deepthaadi Suprabhedaanthaa Vaamadeva Mukhodbhavaah
Vijayaakhyaadi Veeraanthaa Aghora Mukha Sambhavaah
Rouravaakhyaadi Bimbaanthaa Tathpurusha Mukhodbhavah
Geethaadi Vaatulaanthaashcha Eeshaana Mukha Sambhavah
సద్యోజాత ముఖమున - 5
వామదేవ ముఖమున - 5
అఘోర ముఖమున - 5
తత్పురుష ముఖమున - 5
ఈశాన ముఖమున - 8
Shaiva Agamas - Details - First Listeners - Bhedas
శైవాగమముల వివరములు - భేదములు
1. కామికాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : ప్రణవుడు => త్రికళులు => హరుండు
శ్లోకాల సంఖ్య : పరార్థము
ఆగమములోని భేదాలు: 1. ఉత్తర 2. భైరవోత్తర 3. నారసింహం
2. యోగజాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : సుదాఖ్యుడు => బహువు => విభువు
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1. వీణాశిఖోత్తర 2. తార తంత్ర 3. సౌత్యాగమ 4. శాంతాద్యాగమ 5. ఆత్మయోగం
3. చింత్యాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
మొదట-అతని నుండి భొదనొందిన వారు : దీప్తుడు => అంబిక
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1 సుచింత్యాగామము 2 సుభగాగమము 3 వామతంత్ర 4 పాపనాశక 5 సర్వోద్భవ 6 అమృతాగమ
4. కారణాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : కారణాఖ్యుడు => శర్వుడు => ప్రజాపతి
శ్లోకాల సంఖ్య : 1 కోటి
ఆగమములోని భేదాలు: 1 కారణ తంత్ర 2 పావన తంత్ర 3 దాగ్భ్య తంత్ర 4 మహేంద్ర తంత్ర 5 భీమ తంత్ర 6 మారణ తంత్ర 7 ఈశాన తంత్ర
5. అజితాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
మొదట-అతని నుండి భొదనొందిన వారు : శివుడు => అచ్యుతుడు
శ్లోకాల సంఖ్య : నియుతం
ఆగమములోని భేదాలు: 1ప్రభుతాగమ 2 పరోద్భూతాగమ 3 పార్వతీ తంత్ర 4 పద్మ సంహిత
6. దీప్తాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : ఈశుడు => త్రిమూర్తి => హుతాశనుడు
శ్లోకాల సంఖ్య : నియుతం
ఆగమములోని భేదాలు: 1 అమేయాగామ 2 అప్రమాగమ 3 ఆస్యాగమ 4 అసంఖ్యాగమ 5 అమితాజసాగమ 6 ఆనందాగమ 7 మాధవోద్బూతాగమ 8 అధ్బుతాగమ 9 అమృతాగమ
7. సూక్ష్మాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : సూక్ష్ముడు => వైశ్రావణుడు => సుప్రభంజనుడు
శ్లోకాల సంఖ్య : పద్మము
ఆగమములోని భేదాలు: సూక్ష్మ సంహిత8. సహస్రాగమము : శంఖము
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : కాలరుద్రుడు => భీమ రుద్రుడు => ధర్ముడు
శ్లోకాల సంఖ్య : -
ఆగమములోని భేదాలు: 1 అతీతాగమ 2 అమలాగమ 3 శుద్దాగమ 4 అప్రమేయాగమ 5 భౌతిభానాగమ 6 ప్రభుద్దాగమ 7 విబుధాగమ 8 హస్తాగమ 9 అలంకారాగమ 10 సుభోదాగమ
9. అంశుమానాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : అంబువు => ఉగ్రుడు => ఔరసుడు
శ్లోకాల సంఖ్య : 5 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 విద్యాపురాణ 2 భాస్వరాగమ 3 నీలలోహిత తంత్ర 4 ప్రకరణాగమ 5 భూత తంత్ర 6 ఆత్యాలంకార 7 కాశ్యపాగమ 8 గౌతమాగమ 9 మహేన్ద్రాగమ 10 బ్రహ్మాగమ 11 వాసిష్టాగమ 12 ఈశానోత్తరం
10 సుప్రబేదాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : దశేషుడు => విఘ్నేశ్వరుడు => శశి
శ్లోకాల సంఖ్య : 3 కోట్లు
ఆగమములోని భేదాలు: 1 భేదము11. విజయాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : రుద్రుడు => అనాదియు => పరమేశుడు
శ్లోకాల సంఖ్య : 3 కోట్లు
ఆగమములోని భేదాలు:1 విజయ తంత్ర 2 ఉద్భవ తంత్ర 3 సౌమ్య తంత్ర 4 అఘోర తంత్ర 5 మ్రుతపాశక తంత్ర 6 కుబేర తంత్ర 7 విమల తంత్ర 8 మహాఘోర తంత్ర
12. నిశ్వాసాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి భొదనొందిన వారు : ఉదయుడు => గిరిజ
శ్లోకాల సంఖ్య : 1 కోటి
ఆగమములోని భేదాలు:1 నిశ్వాస 2 ఉత్తర నిశ్వాస 3 నిశ్వాస ముఖోదయ 4 నిశ్వాస నిశ్వాసకారిక 5 ఘోర సంహిత 6 సుసౌఖ్య 7 గుహ్యము 8 నిశ్వాస నయనము
13. స్వాయంభువాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి భొదనొందిన వారు : నిధనేశుడు => స్వయంభువు
శ్లోకాల సంఖ్య : 3 కోట్లు
ఆగమములోని భేదాలు:1 స్వాయంభూత 2 ప్రజాపతి మాత 3 పద్మ తంత్రము
14. అనలాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి భొదనొందిన వారు : వ్యోముడు => హుతాశనుడు
శ్లోకాల సంఖ్య : 3 ఆయుతం
ఆగమములోని భేదాలు: 1. అజ్ఞేయం15. వీరాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి భొదనొందిన వారు : తేజుడు => ప్రజాపతి
శ్లోకాల సంఖ్య : నియుతం
ఆగమములోని భేదాలు: 1. ప్రస్తర తంత్ర 2. ప్రస్ఫుర తంత్ర 3 ప్రభోదక తంత్ర 4 భొదక తంత్ర 5 అమోహ తంత్ర 6 మొహసమయ తంత్ర 7 శకట తంత్ర 8 శాకటీయక తంత్ర 9 హల తంత్ర 10 లేఖన తంత్ర 11 భద్ర తంత్ర 12 వీర తంత్ర 13 అమలం
16. రౌరవాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి భొదనొందిన వారు : బ్రహ్మణేశుడు => నందికేశ్వరుడు
శ్లోకాల సంఖ్య : 8 అర్భుదములు
ఆగమములోని భేదాలు:1 కళా దహన 2 రౌరవోత్తర 3 కౌమార 4 కాళ 5 మహాకాల 6 ఇంద్రాగమం 17. మకుటాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : చషాక్ష్యుడు => మహాదేవుడు
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1 మకుటం 2 మకుటోత్తరం 18. విమలాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : సర్వాత్మకుడు => వీరభద్రుడు
శ్లోకాల సంఖ్య : 3 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 అనంత భాగ 2 ఆక్రాంత 3 హ్రుద్వహాస 4 ఆలిప్రతాగమ 5 అద్భుత 6 మారణ తంత్ర
19. చంద్రజ్ఞానాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : అనంతుడు ==> బృహస్పతి
శ్లోకాల సంఖ్య : 3 కోట్లు
ఆగమములోని భేదాలు: 1 స్థిర సంహిత 2 స్థాణు సంహిత 3 మహంత సంహిత 4 నంది సంహిత 5 నందికేశ్వర సంహిత 6 ఏకపాద పురాణ 7 శంకరాగమ 8 నీలభద్ర తంత్ర 9 శిభద్రాగమ 10 కళభేద 11 శ్రీముఖ 12 శివశాసన 13 శివరేఖరాగ 14 దేవీమతం
20. బింబాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి భొదనొందిన వారు : ప్రశాంతుడు => దధీచి
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1 చతుర్ముఖ తంత్ర 2 మలయ తంత్ర 3 మహాయోగ 4 తపోభాగ 5 అప్రతిబింబ 6 అర్థాలంకార 7 వాయువ్య తంత్ర 8 కౌపిక తంత్ర 9 కుతుపినికర 10 తురావృత్త 11 తులాయోగ 12 కుట్టిమ తంత్ర 13 వర్గశేఖర 14 మహావిద్య 15. మహాసారంబు
21. ప్రోద్గీతాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి-అతని నుండి భొదనొందిన వారు : శూలి => కవచాఖ్యుడు
శ్లోకాల సంఖ్య : 3 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 కవచాగమ 2 వరాహతంత్ర 3 పింగళమత 4 పాశాబంధ సంహిత 5 దండధర తంత్ర 6 కుశ తంత్ర 7 ధనుధారిణ 8 శివజ్ఞా 9 విజ్ఞాన 10 ఆయుర్వేద 11 ధనుర్వేద 12 సర్పదంష్ట్ర విభేదన 13 సంగీత 14 భారత 15 అలోడ్యంబు 16 త్రికాల జ్ఞానము 22. లలితాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన వారు : మలయుడు => లలితుడు
శ్లోకాల సంఖ్య : 8 వేలు
ఆగమములోని భేదాలు: 1 లలిత 2 లలితోత్తర 3 కౌమార తంత్ర 4 విఘ్నేశ్వరాగామము 23. సిద్దాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన వారు : ఇంద్రుడు => చండీశ్వరుడు
శ్లోకాల సంఖ్య : సార్థకోటి
ఆగమములోని భేదాలు: 1 సారోత్తర 2 దేవేశోత్తర 3 శాలభేద 4 శశిమండలం 24. సంతానాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన వారు : వసిష్టుడు => వైశంపాయనుడు
శ్లోకాల సంఖ్య : 6 వేలు
ఆగమములోని భేదాలు: 1 లింగాధ్యక్ష 2 అనాధ్యక్ష 3 శంకర తంత్ర 4 మహేశ్వరాగమ 5 అసంఖ్య తంత్ర 6 అనిలాగమం 7 ద్వంద్వాగమం 25. సర్వోక్తాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన వారు : సోముడు => నృసింహుడు
శ్లోకాల సంఖ్య : 2 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 శివధర్మోత్తరం 2 ధర్మ 3 వాయుప్రోక్తం 4 దివ్యప్రోక్తం 5 ఈశానం
26. పారమేశ్వరాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట భొదనొందిన వారు : దేవి
శ్లోకాల సంఖ్య : 12 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 మాతంగ తంత్ర 2 పద్మాగమ 3 పాషర 4 సుప్రయోగ 5 హంసాగమ 6 సామాన్యాగమ
27. కిరాణాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన వారు : దేవపితృడు => సంవర్ధకుడు
శ్లోకాల సంఖ్య : 5 కోట్లు
ఆగమములోని భేదాలు: 1 గరుడాగమ 2 నైరుతాగమ 3 నీలాగమ 4 రిక్షాగమ 5 భానాగమ 6 వైక్రమాగమ 7 బుద్దాగమ 8 ప్రబుద్దాగమ 9 కాల తంత్రము
28. వాతులాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన వారు : శివరుద్రుడు => మహాకాళుడు
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1 వాతుళ 2 ఉత్తర వాతుళ 3 కాలజ్ఞాన 4 ప్రరోచిత 5 సర్వాగమ 6 సర్వాష్టాగమ 7 శ్రేష్టాగమ 8 నిత్యాగమ 9 శుద్దాగమ 10 మహానాగమ 11 విశ్వాగమ 12 విశ్వాత్మకాగమ
28 ఆగమాల శ్లోకాలను ఒకటిగా కూడినచో సంఖ్యను ఈ విధంగా తెలుపుదురు: 2 శంఖములు, 1 పద్మము, 1 అ ర్భుధము, 19 కోట్ల 38 లక్షల 44 వేలు (శ్లోకాలు)
భేదములు - 196
Note: ఆగమాల భేదాల విషయంలో సంఖ్యా, నామాల విషయాల్లో అక్కడక్కడ తేడా కనిపిస్తుంది.
ఈ 28 ఆగమాలను శివ, రుద్ర భేదములతో 2 విధాలుగా విభజించి చూపుతారు :
2. యోగజాగమము
3. చింత్యాగమము
4. కారణాగమము
5. అజితాగమము
6. దీప్తాగమము
7. సూక్ష్మాగమము
8. సహస్రాగమము
9. అంశుమానాగమము
10 సుప్రభేదాగమము
Note: ఆగమాల భేదాల విషయంలో సంఖ్యా, నామాల విషయాల్లో అక్కడక్కడ తేడా కనిపిస్తుంది.
ఈ 28 ఆగమాలను శివ, రుద్ర భేదములతో 2 విధాలుగా విభజించి చూపుతారు :
శివభేద ఆగమాలు : 10
1. కామికాగమము 2. యోగజాగమము
3. చింత్యాగమము
4. కారణాగమము
5. అజితాగమము
6. దీప్తాగమము
7. సూక్ష్మాగమము
8. సహస్రాగమము
9. అంశుమానాగమము
10 సుప్రభేదాగమము
రుద్రభేద ఆగమాలు:18
1. విజయాగమము2. నిశ్వాసాగమము
3. స్వాయంభువాగమము
4. అనలాగమము
5. వీరాగమము
6. రౌరవాగమము
7. మకుటాగమము
8. విమలాగమము
10. బింబాగమము
11. ప్రోద్గీతాగమము
12. లలితాగమము 13. సిద్దాగమము14. సంతానాగమము15. సర్వోక్తాగమము
16. పారమేశ్వరాగమము
17. కిరాణాగమము
18. వాతులాగమము
SIR NEN METHO MTLADALANUKUNTNNA NAKU TELISINA VEERASHAIVA SAHITYANNI METHO PANCHUKUNDAM ANKUNTNNA - MY NUM 9951213473
ReplyDelete