Friday, July 19, 2013

Veerashaiva Lakshanam

వీరశైవ లక్షణము 

వీరశైవుడు తన విశేష లక్షణము చేత అందరికంటేనూ విశేషత కలిగిన వాడైనాడు.

వీరశైవుని లక్షణములు: 
  1. ఇతరుల మాదిరి ఎన్నో క్రియలచే కొంత ఫలాన్ని పొందక, ఉత్కృష్టమైన కొన్ని క్రియలచే కొండంత ఫలాన్ని పొందేవాడే వీరశైవుడు.  
  2. లింగ భోగోపభోగియై ఎల్లపుడు లింగాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడు (ధరించే వాడు).
  3. ఇతరుల వలె దేవుని ఆహ్వాన-విసర్జనల చేయక సదా తన యిష్ట లింగమును అంటిఉండి ఎల్లవేళలా పూజించువాడు.
  4. జాతి సూతక, జన సూతక, ప్రేత సూతక, ఉచ్చిష్ట సూతక, రజస్సూతకము అనే 5 సూతకములు లేక లింగ పూజ సల్పువాడు. 
  5. అనృతము, అస్థిర వాక్యము, వంచనము, పంక్తిభేదము, ఉదాసీనత, నిర్దయత అనే 6 అంతరంగములు  గల  భవి సంస్కారములు  లేనివాడు 
  6. త్రికాల లింగార్చన చేయువాడు.  
  7. శివనింద, గురునింద, జంగమనింద, ప్రసాదనింద, పాదోదకనింద, భస్మధారణనింద, శివక్షేత్రనింద, శివాచారనింద,  శివాగమనిందల  సహింపని వాడు.
  8. శివమహేశ్వరుల చూడగనే లేచి వెళ్లి ప్రియవచనములు పలికి వారిని గౌరవించి అన్నపానాదులు సమర్పించువాడు.   
  9. స్నాన, భోజన, నిద్రా, జాగరణ, మలమూత్ర విసర్జన కాలములలో అశుచి భావమున పొందక, లింగము  దూరమై  బ్రతుక  జాలనన్న  తలంపుతో సదా లింగమును ధరించువాడు.  
  10. శివుడే సర్వమని మరి ఏ దేవతల గణింపని వాడు శివలింగ  లాంచనములు లేని భవులతో సంపర్క, శయన, ఎకాసన సహపంక్తి భోజనములు  చేయనివాడు.
  11. లింగాచార, సదాచార, భ్రుత్యాచార, శివాచార, గణాచారము లనే పంచాచార నిష్టుడు.  
  12. దాసత్వ, వీరదాసత్వ, భ్రుత్యత్వ, వీరభ్రుత్యత్వ, సమయాచారత్వ, సకలావస్థత్వంబు లనే 6 సజ్జనత్వ యుక్తుడైన వాడు.
  13. దేశకాల కల్పితాది లౌకిక ఆచారములను మీరి స్వతంత్రశీలుడై శివాత్ములకు భేద భ్రాంతి లేనివాడు.
  14. పంచాచార్యుల, సిద్ధాంత శిఖామణి వచనముల బద్దుడై కడు భక్తితో మసలువాడు. 
  15. పరమేశ్వర నిర్మితమైన ఈ ప్రపంచమున చరమశరీరి అనబడి అందరిలోకి విశిష్టుడైన వాడు వీరశైవుడు.



No comments:

Post a Comment