Thursday, July 4, 2013

Forewards

ఓం నమః శివాయ


~: ముందుమాట :~

శక్తి విశిష్టాద్వైతము అవలంబించునదే వీరశైవము. ఈ సిద్దంతమూ, లింగారాధన - వీరశైవము గూర్చి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం పుస్తాకాల వల్ల పొందే జ్ఞానం కంటే ఇంటర్నెట్ ద్వారా పొందే సమాచారమే ఎక్కువవుతుంది. ఈ వెబ్ ప్రపంచంలో వీరశైవం గూర్చి చాలా తక్కువ సమాచారం ఉంది. ఉన్నది కూడా సమగ్రంగా లేవు, ఎక్కువగా ఆంగ్లము, కన్నడ భాషలలోనే కలవు. నాకు తెలిసింది నలుగురికి తెలియజెప్పాలనే ఈ ప్రయత్నం 

చిన్ననాటి నుండి నాకు సాహిత్యాభిలాష ఎక్కువ. నేను తెలుసుకున్న విజ్ఞానాన్ని పదిమందికి తెలియజెప్పాలనే నెట్ లో పెడుతూ, నా విజ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నాను.  ప్రస్తుతం నేను రాస్తున్న ఈ బ్లాగులోని ముఖ్య విషయాలు  ఇంతకు ముందు పలువురు పెద్దలు చెప్పినవి, పలు గ్రంధాలలో కన్నవేనని    మనవి.  ఎక్కడైనా తప్పులు దొరలిన మన్నించి తెలియజెప్పిన సరిజేయ గలనని మనవి.






No comments:

Post a Comment