లింగారాధన - ప్రాచీనత్వము
పరమేశ్వరునిచే ఈ సృష్టి నిర్మించబడినది. ఆ శివుని ఆరాధించిన వారాలనే శైవులు
అన్నారు. వారు అవలంబించిన మతమే శైవమ్ అని పిలువబడింది. శైవ మతము అతి ప్రాచీనమైనది.
ప్రపంచ చరిత్ర పరిశోధకుల అభిప్రాయం ప్రకారం లింగ రూప శివార్చన ప్రపంచంలో అతి
ప్రాచీనమైనది. భారత దేశంలోనే కాక ప్రపంచంలోని పలు నదీ తీర ప్రాంతాల్లో లింగారాధన
ఉండినదని నేటికీ బయల్పడుతున్న అవశేషాల ద్వారా దృవీకరించారు. గ్రీకుల ఆరాధనలోనూ లింగ
రూపం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈజిప్టులు ఇప్సి అనే పేరున నైలూ నది
తీరాన
పూజించారు. అమెరికనుల మాయన్ నాగరికతలోని ఉపాస్యదైవమ్ లింగరూపి ఈశ్వరుడే. మక్కాలో మక్కేశ్వర లింగాన్ని ప్రాచీన కాలంలో ఖర్జూరపుటాకులతో పూజించేవారానీ చరిత్ర
చెబుతోంది. హరప్పా, లోధాల్, మొహంజదారో త్రవ్వకాలలో లభించిన ఆధారాలూ లింగ పూజ
ప్రాచీనత్వాన్ని చాటుతున్నాయి. క్రిష్టియన్లకు మూల స్థానమైన ప్రసిద్ద వాటికన్ సిటీ
లోని అతి పెద్దదైన సెయింట్ పీటర్ స్క్వేర్ ప్లాజా సామ్ పీయిట్రో అయితే నల్లగా
శివలింగం ప్రానవట్టాన్ని పోలి ఉంటుంది.
ఇటీవలి కాలంలో అక్కడి వాటికన్ సిటీ లో బయల్పడిన పురాతన కాలపు శివలింగం ఆనాడు ప్రపంచ మంతటా వ్యాపించిన లింగారాధనకు ఒక నిదర్శనం (వాటికన్ లో బయలు పడిన శివలింగము గురించి మరింత ఇక్కడ పొందగలరు: www.stephen-knapp.com/art_photo_fourteen.htm).
అతి ప్రాచీనమైన ఈ లింగారాధన గురించి ఎన్నో ప్రాచీన గ్రంధాలలో కనబడుతుంది. నేటికీ
ప్రతి హిందువూ ప్రతి ఏటా జరుపుకొనే ప్రధాన పండుగ మహాశివరాత్రి -
సృష్టి మొదలైనపుడు బ్రహ్మ,
విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించు సమయాన వారిద్దరి మద్యన
శివుడు లింగాకార అగ్నిగా వెలువడి, అబద్ద వచనాలు పల్కిన బ్రహ్మ ఒక తలను ఖండించుట
వారికి జ్ఞానోదయం కలిగించుట అందరికీ తెలిసిన విశయమే. ప్రాచీన పురానేతిహాసల్లో
కూడా వీరు వారు అని తేడాలేకుండా సర్వులూ లింగ పూజ చేసినట్టు పెక్కు గ్రంధాలలో
తెలియగలము.
చరిత్రనంతా పరిశీలిస్తే నాటి నుండీ నేటి వరకూ లింగారాధన అను నిత్యమూ ఆచరించబడినదని ఆ లింగాన్నారాధించే పద్దతుల ఆచారాన్ని బట్టి కాల పరంపరలో పలు మతాలూ - సిద్దాంతాలూ పుట్టుకొచ్చాయని చెప్పవచ్చు.
శివుడిని-లింగాన్ని ఆరాధించిన శైవులు ఆచార సంప్రదాయాల పరంగా పలు రకాలుగా వెలిశారు.
- మహావిష్ణువు కూడా సహస్ర కమలాలతో లింగార్చన చేసి ఒక కమలం తక్కువై తన కంటినే కమలంగా అర్పించి కమలనాధుడై విష్ణు చక్రాన్ని పొందటం జరిగిందని తెలియనగును.
- హరిశ్చంద్రాది మహారాజులు మార్కండేయాది మునులు శివలింగార్చన చేసినట్లు కలదు.
- త్రేతాయుగంలో కూడా రాముడూ, రావనాసురుడూ లింగార్చన చేయటాన్ని బట్టి ఆ కాలంలోనూ లింగారాధన అంతటా జరుప బడిందని తెలియబడుతుంది.
- ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఎంతో కాలం రుద్రంతో లింగారాధన చేసి శివుని వరంతో సాంబుడనే కొడుకుని పొందాడని, పాండవులూ విశేషంగా దేశమెల్లెడలా స్థాపించిన పెక్కు లింగాలను బట్టి ఆ కాలంలోనూ లింగారాధన ప్రముఖంగా ఉందని తెలియబడుతుంది.
- తరువాతి కాలంలోనూ ఆది శంకరులు లింగారాధన చేయటమే కాకుండా పలు ప్రదేశాల్లో లింగాలను ప్రతిష్టించడం నాటి ప్రాచీన లింగారాదనను తెలుపుతుంది.
- ఇక సోమనాథ, శ్రీశైల, శ్రీకాళహస్తి, కొలనుపాక, కాశీ లాంటి పెక్కు లింగ క్షేత్రాలు ప్రాచీన కాలం నాటి శాసనాలతో తమ ప్రాముఖ్యతను చాటుతున్నాయి.
చరిత్రనంతా పరిశీలిస్తే నాటి నుండీ నేటి వరకూ లింగారాధన అను నిత్యమూ ఆచరించబడినదని ఆ లింగాన్నారాధించే పద్దతుల ఆచారాన్ని బట్టి కాల పరంపరలో పలు మతాలూ - సిద్దాంతాలూ పుట్టుకొచ్చాయని చెప్పవచ్చు.
శివుడిని-లింగాన్ని ఆరాధించిన శైవులు ఆచార సంప్రదాయాల పరంగా పలు రకాలుగా వెలిశారు.
నేటి కాలంలో
శివాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. నవీన సిద్దాంతాలతో వచ్చిన సాయి, సత్యసాయి, బ్రహ్మకుమారీ లాంటి పెక్కు మతాలూ
హిందూ మతపు అతి ప్రాచీనమైన లింగారాధనకు ప్రాముఖ్యత నిచ్చాయి.
అత్యంత ప్రాచీనమూ, పవిత్రమూ అయిన ఇట్టి లింగానికి కొందరు పలు రకాల జుగుప్సా
పూర్వక నిర్వచనాల నివ్వడం వారి అవివేకత్వానికీ, అజ్ఞానానికీ, అహంకారానికీ నిదర్శనమే
అవుతుంది. శివపార్వతుల సంగమ రూపానికి సంకేతమని కొందరనగా, మరికొందరు ముందడుగు వేసి
శివుని అంగమే లింగమన్నారు, ఇంకొందరు శివ, బ్రహ్మ, విష్ణుల సంయోగ రూపమే లింగమంటే,
మరికొందరు శివ, పార్వతీ, విష్ణుల రూపమే లింగమనిరి.
ప్రాచీన కాలంలో మహర్షులూ, యోగులూ, సిద్దులూ, రేణుక, శంకరాది మునులూ సాకారమైన శివుని సంక్షిప్త రూపమే శివలింగముగా భావించి కొలిచి ముక్తి నొందారు అని తెలియాలి. అలాకాక మనసులో మాలిన్యాన్ని నింపుక ఆరాధించిన మోక్షము లభించుట దుర్లభమూ - పాపయుక్తమూనూ.
ఎలాంటి భావన మదిలో మెదలక, కేవల లింగమున లీనమవ్వాలనే భావనో లేక మరేమో కాని ప్రస్తుతం ఇక్కడ వివరించబోయే వీరశైవము మతమున ప్రానవట్టము లేని లింగమే ఆరాధించబడుతుంది. నిజానికి పీఠం, ప్రానవట్టంతో ఉన్న రాతిలింగమే వీరశైవులారాధించే ఇష్టలింగము లోపల ఉంటుంది (తైలముచే ఆ రాతి లింగానికి కంతి వేయబడుతుంది).
ఇష్టలింగమే వారి ప్రాణ దైవం - గురువు నుండి గ్రహించినది మొదలు ప్రాణమున్న పర్యంతమూ అర్చించి ఆరాదించేదే ఇష్ట లింగము. మరణించిన పిదప కూడా సమాధి చేయునపుడు పద్మాసనంలో కూర్చోజేసి చేతిలో ఇష్ట లింగాన్ని ఉంచుతారు. ఈ లింగానికే ప్రథమ ప్రాదాన్యత. దేవాలయాల్లో ప్రతిష్టింపబడిన లింగాలైనా మరే లింగమైనా తరువాతి ప్రాధాన్యతనే కలిగి ఉంటుంది.
Ishtalingam |
వీరశైవులారాదించే ఇష్టలింగ రూపము - అందులో ఉండే లింగము నమూనా
No comments:
Post a Comment