లింగ తత్వము
లింగం అంటే ఏమిటి?
Leenam Gamayatheethi Lingam
దేనియందు సమస్తమూ లయమునొంది మరల పుట్టుచున్నదో అదే లింగమ్. ఈ చరాచరాత్మక విశ్వమే లింగము.
Leeyathe Yatra Bhootaani Nirgacchanthi Yatah Punah !
Thena Lingam Param Vyoma Nishkalah Paramah Shivah !!
ఉత్పత్తి-స్థితి-లయ కారణ భూతమైనట్టి లింగమే పరబ్రహ్మమ్. ఆ పరమశివుడే లింగ స్వరూపము అని సూతసంహిత వచనము. .
Leenam Prapancha Roopaahi Sarva Methath Charaacharam !
Sarvadaa Gamyathe Bhooyaa Sthasmaa Linga Mudeerithim !!
సర్వమూ లింగమందు లీనమై - లింగమునుండే మరల మరల ఉత్పత్తి యగుచుండును
Sarvasya Charaacharaatmakasya Prapanchasya Yallingam Prabhava Leenasthaanam !
LeeyatesminAnthakaale Jagatsarvam Srushtikaale Bahirgacchatheethi Lingam !!
చరాచరాత్మక ప్రపంచపు ఉత్పత్తి - లయములకు లింగమే స్థానభూతము (God Particle).
LeeyatesminAnthakaale Jagatsarvam Srushtikaale Bahirgacchatheethi Lingam !!
చరాచరాత్మక ప్రపంచపు ఉత్పత్తి - లయములకు లింగమే స్థానభూతము (God Particle).
Leeyathe Gamyathe Yathra Yena Sarvam Charaacharam !
Thade ThallingaMithyuktham Linga Thathva Vishaaradaih !!
ఈ ప్రపంచమంతయూ లింగమునందే జనించి - తిరిగి లింగము నందే లయమగు చున్నది. అదియే లింగ తత్వము.
Aakaasham Linga Mithaahuh Pruthivee Thasyaadi Peetikaa !
Aalayam Sarva Bhoothaanaam Layanaam Linga Muchyathe !!
ఆకాశమే లింగ రూపము - పృథ్వియే పీఠం.
సర్వభూతములు ఇందులోనే జనించి - ఇందులోనే మరణించు చున్నవి. కావున లింగమే జగత్తు అని శివపురాణ వచనము .
Linga Garbhe Jagatsarvam, Trailokyam Sa Charaacharam !
Linga BaahyaathParam Naasthi, Tasmaallingam Prapoojayeth !!
లింగము లోపలనే ఈ జగత్తులోని సర్వమూ కలదు - త్రిలోకాలూ అందులోనే కలవు. లింగము బయట మరేదియునూ లేదు - కావున అట్టి లింగమును పూజించవలెను.
Layam Gacchathi Yatthaiva Jagadethath Charaacharam !
Punah Punah Samutpatthim Tallingam Brahma Shaashvitham !!
Tasmaallinga Mithikhyaatham SathAananda Chidaatmakam !
Bruhatthaath BrahmanaTvaaccha Brahma ShabdaaBhideyakam !!
ఏ పరబ్రహ్మము నందు ఈ చరాచరాత్మక ప్రప్రంచము లయించి తిరిగి జన్మించునో అదే లింగస్వరూపమైన బ్రహ్మము. సచ్చిదానందాత్మకమై, మహత్తరమైన ఆ మహాలింగము జగత్ సృష్టి కారకమైనందున బ్రహము (బ్రహ్మ పదార్థము - God Particle) అనబడును.
లింగం ఎలా ఉంటుంది?
వీరశైవ సిద్ధాంతంలో ఇష్ట లింగాన్ని పరమేశ్వరునిలో మనసు లగ్నమై లీనమయేవరకు ఆ పరమేశ్వరునే ఆ లింగముగా భావించి ప్రాణం పోయే వరకూ పూజించాలని చెప్పబడింది. సిద్దులైన వీరశైవ యోగులు ఎన్నో రూపాల లింగారాధన చేశారు - వీరశైవ సిద్ధాంతాలలోనూ ఎన్నో కనిపించని లింగాల ఆరాధన చెప్పబడుతుంది (ఆత్మలింగం, ప్రాణలింగం, ప్రసాద లింగం, తృప్తి లింగం, స్వయం లింగం, చరలింగం, పర లింగం, పిండజలింగం, అండజ లింగం, బింద్వాకాశ లింగం, ఆచారాది షడ్విద లింగాలు పెక్కు కలవు). శృతిస్మృతి పురాణాదులు చెప్పిన పూర్తి బ్రహ్మ పదార్థాన్ని లింగముగా ఆరాధించే ఉత్కృష్ట సిద్దాంతముతో కూడియున్న మతమే వీరశైవ మతము.
లింగము గూర్చి శ్రుతులు ఏమి చెబుతున్నాయంటే:
Yatho Vaatho Nirvarthanthe Apraaprya Manasaasaha - మహాలింగాన్ని మనోవాక్కాయలు కూడా కనుగోనలేవు
AnorAneeyaan Mahatho Maheeyaan - పరమాణువు కన్ననూ అతి సూక్ష్మమైనదీ - గోప్పదానికన్ననూ అతి గొప్పది
SookshamthSookshmatharam - సూక్ష్మము కంటెనూ సూక్ష్మమైనదీ
AthyathistadDashaangulam - ఈ సృష్టి కంటెనూ పది రెట్లు పెద్దనైనది
ChakithaMabhidatthe Shruthirapi - శ్రుతులు కూడా తెలియనట్టిది
Sarvam Khalividam Brahma, Lingam ThathBrahma Sangatham !!
Tallingam Brahma Shaashvatham, Lingam BrahmaSsanaathanam !!
సర్వమూ బ్రహ్మమే (బ్రహ్మ పదార్థమే-God Particle) - ఆ బ్రహ్మమే లింగము. మొదటి నుండీ లింగమూ
బ్రహ్మమూ ఒక్కటే - అని శ్రుతులు చెప్పుచున్నవి.
Thallingam ParamamBrahma Sacchidaananda Lakshanam !
Nijaroopa Mithi DhyaanaaTthadavasthaa Prajaayathe !!
లింగము పరబ్రహ్మము అని, అది సచ్చిదానంద స్వరూపమని - ధ్యానించుటకు నిజరూపమని సిద్దంతాగామము చెప్పు చున్నది.
MahaalingaMidam Devi ManotheethaMagocharam
Nirnaama Nirgunam Nityam Niraamaya Niranjanam
Nirmalam Nishkalam Jneyam Nirbhedyam Nirupaadhikam
AdvaithaanandaMaksheena Masaadrushyamidam Shrunu
AlakshyaMadvayam ShoonyamAmoortham Padamavyayam
Akulaanaamayam ShuddaManaadyam Shiva Muchyathe
Oordhva ShoonyaMadhahShoonyam Madhya Shoonya Svaroopakam
Aadi Madyaancha Shoonyancha Nishkalam Deha Varjitham
ఓ దేవీ మనస్సునకు కూడా కనిపించ నట్టిదీ, పేరు లేనట్టిదీ, గుణము లేనట్టిదీ, నిరామయమైన, నిరంజనమైన, నిర్మలమూ, స్వరూపము లేనిదీ, అనుపమాన మైనదీ, భేదించుటకు వీలు కానిదీ, ఆదీ అంతము లేక నిత్యమూ సత్యమై ప్రకాశించు నట్టిది మహాలింగమని పార్వతీ దేవికి పరమశివుడు చెప్పెను.
Aroopam Nishkalam Brahma, Bhaavaatheetham Niranjanam !
Shabdaadi Vishayaatheetham, Moola LingamIhochyathe !!
రూపము లేనట్టిదీ - నిష్కలమైనదీ భావాతీతమైనదీ, నిరంజనమైనదీ, శబ్దాది విషయములకతీతమైనదీ బ్రహ్మము - అదే మూలమైన లింగము (మూలమైన బ్రహ్మ పదార్థము- God Particle)
లింగం సాకార రూపం ఎవరు?
Shivaroopah Praanalingi - ప్రాణ లింగము శివరూపము అని రుద్రోపనిషత్ వచనం.
Brahmethi Lingamaakhyaatham Brahmanah Pathi Reeshwarah !
Pavitram ThaddVikhyaatham TatramParkaatThanuh Shuchih !!
లింగమునకు బ్రహ్మము అనే పేరు కలదు - అట్టి లింగరూపమైన బ్రహ్మము శివుడు. పవిత్రమై ప్రసిద్దమైన ఈ లింగాన్ని ఎవరు కలిగి యుంటున్నారో వారు శుద్దులగుచున్నారు.
Shivalinga SwaroopamThe Vakshyaami Shrunu Paarvathi
Isthalingam Bhaavalingam Praanalinga Mithi Tridhaa
శివలింగము మూడు రూపాలుగా ఉంటుంది 1) ఇష్టలింగం 2) భావలింగం 3) ప్రాణలింగం అని శివుడు పార్వతికి చెప్పెను. (Sookshmaagama - Patala -8)
Brahma Prajananam Kootam PavitramAmrutham Savah
Prastharo Janima Praano Devo Lingam Thadaivacha
Paryaaya Vaachakaa Yethe Lingasya Paramaatmanah
బ్రహ్మము, ప్రజననము, కూటము, పవిత్రము, అమృతము, ప్రస్తరము, జన్మము, ప్రాణము, దేవత,
లింగము అనునవి పరమాత్మ అనబడు లింగము యొక్క పర్యాయ వాచకములు
Athah Sacchidaananda Lakshanah Parameshwarah !
Swayameva Sadaalingam Nalingam Tasya Vidyathe !!
సచ్చిదానంద రూపుడైన పరమేశ్వరుడే సదా లింగ రూపమున ఉండును. కాక మరే లింగమేదియునూ లేదు.
Athah Shivassarva JagathVibhaavakah SvayamPrakaashah Svayameva Kevalah !
Mayoditho Lingamithi DvijarshabhaaStadeva Poojyam ShruthiMasthakathatham !!
స్వయంప్రకాశుడైన శివుడే లింగరూపమున పూజనీయుడనియూ -
శ్రుతులు చెప్పిన ఉత్తమ సిద్దాంతము ఇదియే అని సూత సంహిత వచనము.
Shivaroopah Praanalingi - ప్రాణ లింగము శివరూపము అని రుద్రోపనిషత్ వచనం.
Brahmethi Lingamaakhyaatham Brahmanah Pathi Reeshwarah !
Pavitram ThaddVikhyaatham TatramParkaatThanuh Shuchih !!
లింగమునకు బ్రహ్మము అనే పేరు కలదు - అట్టి లింగరూపమైన బ్రహ్మము శివుడు. పవిత్రమై ప్రసిద్దమైన ఈ లింగాన్ని ఎవరు కలిగి యుంటున్నారో వారు శుద్దులగుచున్నారు.
లింగం యొక్క రూపాలు
Shivalinga SwaroopamThe Vakshyaami Shrunu Paarvathi
Isthalingam Bhaavalingam Praanalinga Mithi Tridhaa
శివలింగము మూడు రూపాలుగా ఉంటుంది 1) ఇష్టలింగం 2) భావలింగం 3) ప్రాణలింగం అని శివుడు పార్వతికి చెప్పెను. (Sookshmaagama - Patala -8)
No comments:
Post a Comment