Friday, July 12, 2013

Vaidikam

 వీరశైవము వైదికము


వీరశైవము వైదిక మతమే అని తెలియవలె. అవైదికమైన మతాలు పెచ్చరిల్లి ఎవరూ నిలువరించలేక వేదమతాలు వెనుకబడిన తరుణంలో వీరశైవము విజ్రుంబించినది. అవైదిక మతాలు పెచ్చరిల్లడానికి ప్రధాన కారణం ఆ కాలంలో యజ్ఞ యాగాదులకై చేయబడిన బలులు, వాటిని గర్హిస్తూనే కొత్త అవైదికమతాలూ అహింసా పూర్వకంగా వెలువడ్డాయి. వీరశైవము కూడా అదే సరళిలో పూర్తి వైదిక  పంథాననుసరిస్తూ   కాలానుగుణమైన నవీన పోకడలతో అందరినీ ఆకర్షింప జేసినదై, అవైదిక మతములను కనుమరుగు చేసినది జగమెరిగిన సత్యం.  వీరశైవమతంలో  వైదికాచరణ  నాడే  కాదు  నేడు కూడా కలవు. ప్రతి శుభ కార్యములోనూ వేదమంత్రోచ్చారణలతోనే  పూజాధికాలు  జరుపబడతాయి. వీరశైవులు వేదాలలోని రుద్రమంత్రాలతో, యజుర్వేదంలోని రుద్ర నమక-చమకములతో ఇష్ట లింగాన్ని అభిషేకిస్తారు. సామర్థ్యం లేని ప్రతి  వీరశైవుడు  నిత్యం  జపించేది  యజుర్వేద మణిమకుట మంత్రమైన పంచాక్షరినే.

మనుగడను నిలుపుకోవాలంటే మారుతున్న కాలంతో బాటు మార్పునకు లోనవాలి. అది అవైదీకమనబడదు, అవైదికమని అనుట వారి అజ్ఞానానికి తార్కాణమే అవుతుంది. అయినా వేదములోనే దీనికి మనకు సమాదానము దొరుకుతుంది. 

यान्यस्माकं सुचरिथानि थानी सेविथव्यानि नो इथराणि  (Taitthireeyopanishath -11-10-2)
ఎట్టి కర్మలు మనకు ఉత్తమ మైనవో వాటినే మనము ఆచరించాలి, ఇతరములతో పనిలేదు.

कर्मउअज्ञास्थापोयज्ञो जपयज्ञस्थाथपरः
ध्यानयज्ञो ज्ञानयज्ञः पञ्चयज्ञ इथि स्मृथः (Sukhmagamam, Patalam: 6)
కర్మయజ్ఞము, తపోయజ్ఞము, జప యజ్ఞము, ధ్యాన యజ్ఞము,  జ్ఞాన యజ్ఞము అనునవి పంచ యజ్ఞములు - వీటిలో దేనినాచరించిననూ  వైదికత్వమే అని తెలియాలి.

शिवार्थे देहासंशोषः तपः कृच्छदि नो मथं
शिवार्चा कर्म विज्ञेयम् बाह्यम् यागादि नोच्यथे
जपः पन्चाक्षराभ्यसः प्रणवाभ्यास एव वा
रुद्राध्यायदिकाभ्यासो  न वेदाद्यनादिकं  (Siddantha Shikhamani 9-23, 24)
శివుని అర్చించుటకై దేహమును కష్టపెట్టుట  తపస్సు అగును. అట్లు గాక క్రుచ్చ చాంద్రాయణాది వ్రతముల నాచారించుట తపస్సు కాదు. ఇష్టలింగమును నిత్యకర్మగా అర్చించుటయే కర్మగాని బాహ్యకర్మలైన యాగాదులు నిత్యకర్మలు కావు. 
పంచాక్షరమంత్రమును అభ్యాసము చేయుట లేదా ఓంకారాన్ని అభ్యాసము చేయుట లేదా రుద్రాధ్యాయమును అభ్యాసము చేయుట జపమనబడుతుంది, కాని వేదాధ్యనాదులు కావు.  (ఇక్కడ వేదములోని జ్ఞాన ప్రదమైన పంచాక్షరాది జపమునే నిర్దేశించబడింది కాని వేదములోని యజ్ఞ యాగాదులు కావు అని తెలియాలి)

मदार्च कर्म विज्ञेयम् बाह्ये यागादि नोच्यथे
मदर्थे देह संशोषस्थापः कृच्रादिनो मथं
जपः पञ्चाक्षराभ्यासः प्रनावाभ्यान एवच
रुद्राध्यायदिकाभ्यासो  न वेदाध्ययनाधिकं
ध्यानं मद्रूपचिन्थाद्यं नात्मध्यर्थनमादय
ममागमार्थ विज्ञानं ज्ञानं नान्यार्थ वेदनं     (Vayuveeya Samhitha-Uttarabhaga-Adhyaya-1)

శివార్చన చేయుటే కర్మయజ్ఞము కాని బాహ్య యాగాదులు కావు.
నా నిమిత్తమైన దేహ సంశోషణమే తపోయజ్ఞము కాని క్రుచ్చ చాంద్రాయణాదులు కావు.
పంచాక్షరినో, ప్రణవమునో,  రుద్రాధ్యాయమునో అభ్యసించుటయే జపయజ్ఞము కాని ఇతరములైన కామ్య కర్మపర వేదాద్యయనములు కావు.
నా రూపమును చింతించుటయే ధ్యానయజ్ఞము కాని  వస్తు చింతన ధ్యాన యజ్ఞము కాదు.
శివాగామముల విశేషార్థమును గురు ముఖమున తెలుసు కొనుటయే జ్ఞానయజ్ఞము కాని  అన్యార్థముల తెలియుట జ్ఞాన యజ్ఞము కాదు అని పరమశివుడు తెలిపెను.

శివ భగవానుడు తెలిపిన ఈ పంచ యజ్ఞములను వీరశైవులు ఆచరించుతున్నారు - ఆ విధముననూ వీరు వైదికులే అగుచున్నారు. 

వేదాగమ ఉపనిషత్ పురానాదులనుండి వీరశైవ సిద్దాంతమును (వీరశైవుల  ధర్మగ్రంధమై వెలసిన సిద్దాంత శిఖామణి ని) సిద్దపరచిన శివయోగి శివాచార్యులు సిద్దాంత శిఖామణి వ్రాస్తూ ఇలా చెప్పారు

VedamaargaAvirodhena Sishishtaachaara Siddaye !
Asanmaarga Nirasaaya Pramodaaya Vivekinaam !! (Siddantha Shikhamani 1-26)
వేదమార్గాములకు విరోధము కానటువంటి, విశిష్టమైన ఆచారాల సంస్థాపన కొరకై, చెడు మార్గములను నిరసించుట కొరకునూ, వివేకవంతులను సంతోషము చేయుట కొరకు సిద్దాంత శిఖామణిని రాస్తున్నానని తెలిపాడు. 

ఈ ఒక్క శ్లోకమే వీరశైవము వైదీకమని - అవైదీక మతములను ఖండించుటకే సిద్దాంత పరచబడినదని తెలుపుతుంది.

వీరశైవ సిద్దాంతాన్ని వ్యాప్త పరచుటకు ఉద్భవించిన రేణుకాచార్యునకు  పరమశివుడు ఇలా చెప్పెను:
MadathAdvaithaparam Shaastram, Veda Vedaantha Sammatham !
Sthaapayishyasi Bhooloke, Sarveshaam Hithakaarakam !!
Mama PrathaapamAthulam, Madbhakthaanaam Visheshathah !
Prakaashaya Maheebhaage, Veda Maargaanusaarathah !!  (Siddantha Shikhamani 3-86, 87)
నాతో అద్వైతపరము (అనగా శివాద్వైతపరమనట్టి), వేదవేదాంత సమ్మతము, సర్వజనులకూ  హితము చేసే శాస్త్రాన్ని నీవు భూలోకములో స్థాపించెదవు. 
నా ప్రతాపము అసమానమైనది - నా భక్తుల ప్రతాపము ఇంకనూ నాకన్న విశేషమైనది అనే విషయమును వేదమార్గమును అనుసరించి భూలోకమున ప్రసారము చేయుము.  
  
అంతరించిపోతున్న ఆస్తికత్వాన్ని మేల్కొలపటానికి, హిందూ మతోద్దరణకు పూనుకొని ముందడుగు వేసిన వైదికమతమే  వీరశైవము.  







No comments:

Post a Comment