Sunday, July 17, 2016

Birth Place of Veerashaivam Kolanupaka - 2

వీరశైవం మూలస్థానం కొలనుపాక -2

                                 రేణుకాచార్యులు కొలనుపాకలో ఉద్భవించారని తెలిపే ఆధారాలు  


వీరశైవమతమందు పూర్వకాలమున ఆచార్యులు/మఠాదిపతులు, ఆచార్యత్వం/మఠాధిపత్యం వహించిన పిదప తమ మాతాపితల వివరాలు లాంటివి చెప్పుకునేవారు కాదు, వాటి గురించి ఎవరూ అడిగేవారు కూడా కాదు. వీరిని లింగోద్భవులు అనే చెప్పేవారు, అలాగే చనిపోయినప్పుడు లింగైక్యులు అనే చెప్పేవారు (ఇప్పటికీ ఎవరైనా చనిపోతే లింగైక్యం చెందారనే మాటనే వీరశైవులు వాడతారు.  అంతేగాక చాలా గ్రామాల్లోని మఠాలకు సంబందిచిన పూర్వ పీఠాధిపతుల జనన విషయాలు ప్రస్తుతం ఉన్నవారికి తెలియకుండా ఉన్నది సత్యం).  అందుకే చాలామంది ఆచార్యులు/మఠాదిపతుల వివరాలు తెలియకుండా పోయాయి.   

రేణుకాచార్యుల వారు పంచాచార్యులలో ఒకురుగా ప్రసిద్దులు (నేటికి ఇంటర్నెట్ ప్రపంచంలో లభ్యంగా ఉన్న ఇందుకు సంబందించిన విషయాల లింక్ లను క్రింది తెలుపుతున్నాను)
1. http://www.shaivam.org/virashaivam/adv_panca.htm
2. http://en.wikipedia.org/wiki/Panchacharyas
3. http://panchapeeth.com/sri-rambhapuri-peeth.html
4. http://rambhapuripeetha.info/rich-lineage.htm
5. http://www.shrisiddhanthashikhamani.com/kannada/27-history-of-veerashaiva-shri-siddhanthashikhamani
6. http://www.divinebrahmanda.com/2012/03/rambhapuri-peeta-balehonnur-rambhapuri.html
7. http://www.muttinakantimathgurupeetha.com/index.php/history
8. http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%E0%B0%AA%E0%B0%BE%E0%B0%95

అలాగే ద్వాదశ ఆరాధ్యులలో ఒకరుగా కూడా రేణుకాచార్యులు ప్రసిద్దులు:
1. http://www.shaivam.org/ad-dwadasa-aradhyas.htm
2. http://www.sroutasaivasiddhanta.com/dwadasaradhyas.htm
3. http://www.srisaivamahapeetham.org/phylosophy.htm

రేణుకాచార్యుల వారు నల్గొండ జిల్లా కొలనుపాకలోని సోమేశ్వర లింగోద్భవులని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని సిద్దంతశిఖామనిలోని 4వ పటలములోని శ్లోకాలు వివరిస్తాయి. 

అథ త్రిలింగ విషయే కొల్లిపాక్యభిధేపురే !
సోమేశ్వరమహాలింగాత్ ప్రాదురాసీత్ స రేణుకః !! (4-1)
ప్రదుర్భూతం తమాలోక్య శివలింగాత్ త్రిలింగజా: !
విస్మితాః ప్రాణినః సర్వే  బభూవురతి తేజసమ్ !! (4-2)

మరియు రేణుకాచార్యులు కొలనుపాక సోమేశ్వర లింగమునుండి ఉద్భవించారని స్వయంభువాగమం 9వ పటలం లో చెప్పబడింది.  ఈ 9వ పటలంలో మొత్తం అయిదుగురు పంచాచార్యుల గురించి వివరంగా తెలుపబడి ఉంది.  

శ్రీమద్రేవణ సిద్దస్య కొలిపాక పురోత్తమే!
సోమేశ్వర లింగ జనన మావాసః కదళీపురే !!  (స్వయంభువాగమం, చాప్టర్-9)

రేణుకాచార్యులు కొలనుపాక లింగోద్భవులని తెలిపిన కొన్ని గ్రంధాలు - రచయితలు (ఈ వివరాలు శివశ్రీ రవికోటి మఠం వీరభద్రయ్య గారు రచించిన "శ్రీక్షేత్ర కొలనుపాక వీరశైవ విభూతి రేవణసిద్దుడు" నుండి గ్రహించబడినవి):
రేణుకావిజయం  (ప్రథమ మంజరి-27,37 శ్లోకాలు) - సిద్దనాథ శివాచార్య - సంస్కృతం  
రేవణ సిద్దేశ్వర పురాణము - (సంధి 2, పద్యము-53) - బొమ్మరస - కన్నడము 
రేవణ సాంగత్య - (సంధి-2 పద్య-21) - చన్నబసవ  - కన్నడము
రేవణ సిద్దేశ్వర రగళె (నిరత స్థలం -57 వ పంక్తి) - మహాకవి హరీశ్వర  - కన్నడము
కవికర్ణ రసాయనం (ప్రథప సర్గ-శ్లోకం-6) - మహాకవి షడక్షర దేవ  - కన్నడము
రేణుక విజయము - (ప్రథమాశ్వాసం-పద్యము-49) - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి - తెలుగు 
పంచబ్రహ్మొదయ భాష్యం (పుట-17) - సోసల చిక్క వీరనాధ్య  - కన్నడము
శివాధిక్య శిఖామణి (ప్రథమోపదేశమ్ - పుట-2) - సోసల రేవణారాధ్య  - కన్నడము

కాగా వీరశైవంలో ఆది రేణుకుల పిదప ఎంతోమంది రేణుక పేరున ప్రసిద్దినొందుటచే వీరశైవ సాహిత్యంలో ఎవరు ఎవరేనేది కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అయినా ఆది రేణుకులు నల్లగొండ జిల్లాలోని కొలనుపాక లింగోద్భవులనేది అందరి సమ్మతమే. దేశ సంచారం సాగించి ధర్మ ప్రచారాన్ని ముగించిన పిదప రేణుకాచార్యుల వారు కొలనుపాక సోమేశ్వర లింగములోనే ఐక్యమొందటం జరిగింది. 


సిద్దాంత శిఖామణి వీరశైవుల పరమ ప్రామాణిక గ్రంధం (ధర్మ గ్రంధం)

సిద్దాంత శిఖామణి గ్రంధం శక్తివిశిష్టాద్వైత (వీరశైవ) సిద్దాంతాన్ని ప్రభోదిస్తుంది. ఈ గ్రంధంలో చెప్పబడిన అష్టావరణ, షట్ స్థల, పంచాచార సిద్దాంతాన్ని నేటికీ ఎంతోమంది తమ సంప్రాదాయంలో ఆచరిస్తున్నారు. ఈ గ్రంధ సిద్దాంతాన్ని పాటించేవారు భారతదేశంలో చాలాచోట్ల పలు సంప్రదాయికులుగా కనబడతారు. లింగధారణ, లింగారాదనే వీరికి ప్రాముఖ్యం.  

సిద్దాంతశిఖామణి  గ్రంథాన్ని తెలుగులిపిలో శ్రీశైల జగద్గురుపీఠం వారు ప్రచురించారు. అలాగే శ్రీ S.P.బాలసుబ్రహ్మణ్యం గారి స్వరంలో ఆడియో కేసెట్ రూపంలో కూడా తెలుగులో తీసుకువచ్చారు శ్రీశైల జగద్గురువులు. 

తెనాలి సాధనా గ్రంథమండలి వారు మంచి తెలుగు వివరణతో 1960లో  ప్రచురించటం జరిగింది. 

శ్రీ కాశీ జగద్గురు పీఠం వారు తెలుగు వివరణతో 2012లో ప్రచురించటం జరిగింది. ఈ గ్రంధమే తెలుగులో ఇప్పుడు లభ్యంగా ఉన్న గ్రంధం. 


సిద్దాంతశిఖామణి గ్రంధానికి సంబందించిన కొన్ని  లింక్స్ :
1. http://www.shrisiddhanthashikhamani.com/
2. http://en.wikipedia.org/wiki/Siddhanta_Shikhamani
3. http://siddhantashikhamani.blogspot.in/2011/02/siddhanta-shikhamani.html
4. http://www.kamakotimandali.com/blog/index.php?p=406&more=1&c=1&tb=1&pb=1

సిద్దాంతశిఖామణి గ్రంధకాలం ఖచ్చితంగా తెలియలేకున్నది. అయితే సిద్దాంతశిఖామణిని తన శ్రీకర భాష్యములో ప్రస్తుతించిన శ్రీపతి పండితుడు క్రీ.శ.960 ల ప్రాంతం వాడని తెలియబడుతున్నందున అంతకు మునుపుననే సిద్దాంతశిఖామణి రాయబడిందని, రేణుకులు కూడా అంతకు పూర్వులే అని తెలియవస్తుంది.

శ్రీకరభాష్య కర్త అయిన శ్రీపతి పండితుడు క్రీ.శ.900 ప్రాంతం వాడని, క్రీ.శ.980 ప్రాంతానికి చెందిన "కుసుమాంజలి" గ్రంధంలో ఉదయనుడు శ్రీపతి పండితుని విమర్శించటం జరిగిందని  డా.సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమ "ఇండియన్ ఫిలాసఫీ" అనే గ్రంథంలో తెలిపారు.

శ్రీ నిడదవోలు వెంకటరావు గారు తమ "తెలుగు కవుల చరిత్ర" లో శ్రీపతి పండితుడు క్రీ.శ. 930 ప్రాంతం వాడని తెలిపారు. 

శ్రీకరభాష్యం ప్రచురిస్తూ శ్రీ పండిత చిదిరేమఠం వీరభద్రశర్మ గారు శ్రీపతి పండితుడు 1072 ప్రాంతపు వాడని బెజవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలోని శిలాశాసనం ఆధారంగా ప్రకటించారు.

తెనాలి సాధనా గ్రంధ మండలి వారు 1960 ప్రాంతంలో ప్రచురించిన సిద్దాంతశిఖామణిలో (తెలుగు అనువాదం) ప్రచురించిన శ్రీ పండిత కాశీనాథుని మున్నుడిలో క్రీ.శ.1061 ప్రాంతంలోని పలు గ్రంధాలలో (శ్రీకరభాష్యం సహా) సిద్దాంతశిఖామణి ప్రస్తావించబడిందని రాయబడింది.  

శ్రీశైల సూర్యసింహాసన మఠం వారు (పంచాచార్య జగద్గురు పీఠం)  ప్రచురించిన సిద్దాంతశిఖామని (తెలుగులో మూల శ్లోకాలు ప్రచురించారు) లో శ్రీపతి పండితుడు క్రీ.శ. 1000 ప్రాంతం వాడని తెలిపారు. 

సిద్దాంత శిఖామణి గ్రంధకాలం ఏదైనా ఈ గ్రంధం పండితులందరిచేత పరమోత్తమమైన జ్ఞానగ్రంధంగా కొనియాడబడింది. రచయిత శివయోగి శివాచార్యులు తన తండ్రి సిద్దనాథుడని, తాత ముద్దదేవుడని, తాత తండ్రిగారు శివయోగి అని తెలుపుట జరిగింది, కాని జన్మ ప్రదేశం గూర్చి తెలుపలేదు. చరిత్రకారులు కూడా వెలుగుపరచలేక పోయారు - నిజానికి ఈ విషయంలో కృషి చేసినవారు ఉన్నట్టు కూడా తెలియటం లేదు. కాగా  కొందరు వీరు కొలనుపాకకు చెందినవాడే  అని విశ్వసిస్తారు. 

కొలనుపాకలో అన్ని కులాల వారికీ రేణుకుల వారు మఠాలు కట్టించి దీక్షా సంస్కారాలు ఇవ్వటం జరిగింది. అవి నేడు చాలా వరకు కనుమరుగైపోగా కొన్ని మఠాలు మాత్రం శిథిలావస్థలో ఉన్నవి. వాటి వివరాలు శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య మహాస్వాముల వారి "వీరశైవము" (1966) నుండి - పేజీ-8:
1. పెద్ద మఠము 2. కురుమ మఠము 3. కాపు మఠము 4. కోమటి మఠము 5. గౌండ్ల మఠము 6. చాకలి మఠము 7. మంగలి మఠము 8. పద్మశాలి మఠము 9. మేదరి మఠము 10. పెరుక మఠము 11. మాల మఠము 12. మీమ్మాఱు మఠము (వడ్రంగి, కంచరి, కమ్మరి, శిల్పి) 13. గొల్ల మఠము 14. ఒడ్డెర మఠము  (దీనిని నక్క రామేశుని గుడి అనీ అంటారు) 15. సంగరి మఠము 16. తెనుగు మఠము 17. మేరె మఠము 18. గాండ్ల మఠము. 

సోమేశ్వర క్షేత్ర ఆలయ ఆవరణలో  కాకతీయ రుద్రమదేవి శిలా విగ్రహం ఉందని, ఇక్కడ రేణుకుల సంస్కరణల ప్రభావం నేటికీ ఉందని, అన్ని కులాలవారు పుట్టినపుడే లింగాలు ధరిస్తారని, ఈ ఊరిలో లింగవంతులైన మాలవాండ్లు మిగతా గ్రామాలలో మాదిరి ఊరి వెలుపల కాక ఊరు మధ్యలోనే నివసిస్తున్నారని శ్రీ ఉజ్జయిని జగద్గురువులు శ్రీ తరుళబాళు శివకుమార ఆచార్యులు తమ 1-జనవరి-1962 నాటి కొలనుపాక క్షేత్ర పర్యటన వివవరాలను 19-4-1963 (సంచిక-37) నాటి నవసందేశ కన్నడ పత్రికలో వివరించారు. 

చారిత్రకంగానే కాక సంస్కరణల పరంగానూ ఈ కొలనుపాక తన ఔన్నత్యాన్ని చాటుకుంది. కొలనుపాకతో (కొల్యపాక) బాటు తెలంగాణా ప్రాంతంలోని పఠాంచెరువు (పొట్లచెఱువు), జోగిపేటలు ఆనాడు జైనులకు, వీరశైవులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నట్లు చారిత్రిక ఆధారాలవలన తెలుస్తుంది. ఇప్పటికీ కొన్ని శిథిలాలు, శాసనాలు పఠాంచెరువులో రోడ్లప్రక్కనే పడిపోయి కనిపిస్తాయి. ఆనాటి ఆనవాళ్ళను, విశేషాలను పదిలపరచటం ముందు తరాలకు అందజేయటం మన కర్తవ్యమ్.   

నల్లగొండ జిల్లాలోని కొలనుపాక ఒక్క వీరశైవమతస్థులకే కాక జైనులకూ, వైష్ణవులకూ కూడా ఎంతో ప్రసిద్దమైన స్థలం. ఇది చారిత్రకంగా ఎంతో ప్రసిద్ది నొందిన అతి పురాతన నగరం. ఇక్కడి నారాయాణస్వామి మందిరం కూడా అతి పురాతనమైనది. అలాగే జైన ఆలయం కూడా అతి పురాతనమైనదే. ఈ జైన ఆలయంలోని విగ్రహం అతి విలువైన రాతితో దాదాపు 35 అడుగుల ఎత్తున ఉండటం విశేషం. 

ఇక్కడ కనిపించే ఎన్నో శాసనాలు ఒకానొక కాలంలో కొలనుపాక ఎంతో ప్రసిద్ది చెందిన నగరమని తెలియపరుస్తాయి. పరిరక్షించే నాథుడు లేక ఎన్నో శాసనాలు, అక్కడి విగ్రహాలు చాలా భిన్నమైపోయాయి. సోమేశ్వర గుడి కూడా ఇప్పటికీ దీనావస్థలోనే ఉండడం భాద కలిగించే విషయం. ఇదే కాక ఇక్కడి గుళ్ళు, మఠాలు కూడా జీర్ణావస్థలోకి చేరు కున్నాయి. 
నిజానికి ఎంతోమంది వీరశైవం జన్మస్థానం కర్ణాటక అని భ్రమపడతారు - అది శుద్ధ తప్పు. మొదటగా తెలంగాణా లో పుట్టి తెలుగు దేశంలో ప్రాచుర్యం పొంది ఆ పైన భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు ప్రాకింది అని చరిత్రను పరిశోధిస్తే తెలుస్తుంది. ఈ విషయమై ఎక్కువగా పరిశోధన సాగించిన వారూ లేరు. పంపన తెలుగు వాడే అయినా కర్ణాటకలో ప్రాభవం పొంది ఆదికవి స్థానం పొందినట్టు వీరశైవం కూడా ప్రాచుర్యం పొందింది. కర్ణాటకాది ప్రాంతాల్లో వీరశైవం ఆనవాళ్లు క్రీ. శ. 1000 తరువాతనే కనిపిస్తాయి. బసవేశ్వరాది ప్రముఖులు వీరశైవాన్ని బాగా ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది. ఎంతోమంది శివశరణులు బయల్పడి అక్కడ వీరశైవాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకు వెళ్ళటం జరిగింది. అయితే అంతలా కాకపోయినా తెలుగునాట కూడా ఎంతోమంది రచయితలు మరియు స్వాములు కూడా ప్రముఖంగా వీరశైవమును ఉన్నతస్థితికి తీసుకు వెళ్ళటం జరిగింది. పంపన (కొందరు తరువాత జైనుడు అంటారు), నన్నేచోడుడు,  పాల్కురికి సోమనాథుడు, పిడపర్తి సోమన, పోతన, మల్లికార్జున పండితుడు... చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వీరశైవ కవులు తెలుగులోనే అధికంగా కనిపిస్తారు. తెలుగులో ప్రత్యేకంగా శివకవులు గా కూడా గుర్తింపు పొందారు. చాలా మందికి తెలియని వ్యక్తులు, ప్రాచుర్యంలోకి రాని గ్రంథకర్తలూ, గ్రంధాలూ నేటికీ ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిదానంగానైనా ఈ విషయాలు తరువాత వెలుగులోకి రాగలవు. 

Birth Place of Veerashaivam - Kolanupaka - 1

వీరశైవం మూలస్థానం కొలనుపాక - 1

  భారతావనిలో వైదికమతం వెనుకంజ వేసిన తరుణంలో ఆయా కాలాల్లో ఎందఱో మహాత్ములు జనించి, సనాతన భారతీయ ధర్మాన్ని సందర్భాన్ని బట్టి నూతన పంథాలో పునరుద్దరించి ప్రజలని జాగృతపరచటం జరిగింది - నిజానికి ఆయా మతాల పరమోద్దేశం అదే. ఆది శంకరులు కేరళలో జన్మించి, అవైదికమతాలను ఖండించి, అద్వైతమత సిద్దాంతాన్ని ప్రతిపాదించి - పంచాయతన పూజను ప్రవేశ పెట్టి వైదిక ధర్మాన్ని పునరుద్దరించడం జరిగింది. తరువాత ఎంతోమంది మహాపురుషులు ఈ భారతావనిపై ఆయా కాలాల్లో అవతరించి తమ ప్రభోదాలతో ప్రజలను సన్మార్గ పంథాలో తీసుకువెళ్లటం జరిగింది.  

ఆ కోవలోనే  రేణుకాచార్యులు వారు నేటి తెలంగాణాలోని నల్గొండ జిల్లా కొలనుపాకలో ఉద్భవించి శక్తివిశిష్టాద్వైతాన్ని ప్రభోదించడం జరిగింది. ఈ  శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే వీరశైవంగా పిలుస్తారు. వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. 

మిగతా పీఠాలు:- 
ఉజ్జయిని-మరుళారాధ్య
కేదారనాథ్-ఎకోరామారాధ్య
శ్రీశైల-పండితారాధ్య
కాశీ-విశ్వారాధ్యులు

వీరి గురించి ఆగమాల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పీఠాదిపాతులను జగద్గురువులుగా సంబోదిస్తారు. 

కాగా పస్తుతం రేణుకాచార్య పీఠం శాఖ వారు మాత్రం కొలనుపాకలో కాక కర్ణాటకలోని బాలేహోన్నూరులో కొనసాగాబడుతుంది. 

కాశీలో ఉన్న మఠాల అన్నిటిలోకి అతిపెద్దది, అతిపురాతనమైనదీ కాశీ జంగమవాడి మఠం. మొఘల్ సామ్రాజ్య కాలంలో కూడా ఈ మఠానికి విశిష్టస్థానం లబించటం, అక్భర్, షాజహాన్ ఆదిగాగల మొఘల్ రాజులందరూ ఎన్నో దానాలను ఈ మఠానికి సమర్పించారు. ఇట్టి విశేషమైన మఠానికి తరువాతికాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన చిదేరేమఠం వీరభద్రశర్మ గారు (తెలంగాణలో విభూతి పత్రికను నడిపారు) మఠాధిపతిగా విరాజిల్లటం జరిగింది.  

రేణుకాచార్యుడు ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని,   శివయోగి శివాచార్యులు క్రీ.శ.900 ప్రాంతంలో "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంధస్తం చేయటం జరిగింది. ఈ గ్రంధం అప్పటికే వీరాగమాది 28 గ్రంధాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు భోదించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది. 


ఈ గ్రంధమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము. ఈ సిద్దాంత శిఖామణి గూర్చి తరువాత పలు గ్రంధాలలో ప్రస్తుతించటం జరిగింది. బ్రహ్మసూత్రములకు  భాష్యము - శ్రీకరభాష్యం వ్రాసిన  శ్రీపతి పండితాచార్యుడు తన గ్రంధమున సిద్దాంతశిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోన్నాడు. వీరు  క్రీ.శ. 960 ప్రాంతమునకు  చెందినవాడు. 
వీరు సిద్దాంతశిఖామణిని   ప్రస్తావించుటన అతనికి పూర్వమే ఈ గ్రంధము వెలువడినదని చెప్పవచ్చు. 

శ్రీపత్ పండితుడు తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదాహరించటం జరిగింది.

అలాగే "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అను బ్రహ్మ సూత్ర భాష్యమున కూడా:
"పవిత్రంతే" - ఋగ్వేద మంత్రస్య సిద్దాంత శిఖామణి శ్రీ రేణుకాచార్యేన లింగాధారణ పర్వతేన నిర్దేశిత్ అని
"రేణుక భగవత్పాద చార్యేణాపి" - పిండతాపిండ విజ్ఞాన మిత్యారభ్యవితాని  శివ భక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః "ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథ ఔన్నత్యాన్ని కొనియాడాడు. 
  
అంతేగాక  శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో  సిద్దాంత శిఖామణి శ్లోకములను  ప్రమాణ యుక్తముగా ఉదాహరించుట జరిగింది. 

శ్రీకంఠ శివాచార్యులు తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను బ్రహ్మ సూత్ర భాష్యమున:
సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్ ముక్త శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదాహరించుట జరిగింది.


ఇంకనూ ప్రసిద్ద సిద్దాంత కౌముది కర్త భట్టోజీ దీక్షితుల "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకరభట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక" ,  "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" మొదలుగాగల గ్రంధములలో సిద్దాంతశిఖామణి ప్రమాణముల ఉదాహరించుట జరిగింది. 

అలాగే రేణుకాచార్యులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ద, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా కొలనుపాకలో అన్ని కులాలవారికీ వీరశైవ దీక్షలు ఇవ్వటమే కాక ప్రతి కులానికీ ఒక మఠాన్ని స్థాపించటం జరిగింది. ఇప్పటికీ అక్కడ పాడుబడిపోయిన ఆనాటి కులాల వారీ మఠాలు నేటికీ కనిపిస్తాయి. ఆ తరువాత రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది. 

Sunday, June 26, 2016

Literature

నిజానికి వీరశైవము గూర్చి పూర్వకాలంలో తెలుగులోనే ఎక్కువగా గ్రంధాలు వెలువడ్డాయి. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, శివతత్వసారమ్ ఆదిగా ఎన్నో కలవు. ఆధునిక కాలంలో ఐతిహాసిక సామ్రాట్ శివశ్రీ బండారు తమ్మయ్య గారు (ఆంధ్ర సారస్వత పరిషత్ అద్యక్షులు) వీరశైవ సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయం (వివిధ పత్రికల్లో లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు, పలు గ్రంధాలు ప్రచురించి వీరశైవ తెలుగు సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారు). అలాగే పండిత శ్రీ చిదిరేమఠం వీరభద్ర శర్మ గారు (పిదప్ కాశీ జ్ఞాన సింహాసనాన్ని అధిష్టించి జగద్గురువులైనారు) విభూతి మాస పత్రికను 1939 లో స్థాపించి వీరశైవ వెలుగులు ప్రసరింప జేశారు, పలు గ్రంధాలు ప్రచురించారు, అంతే గాక వీరశైవాన్ని తూలనాడే పలువురు పండితులతో ఎన్నో వాదనలు జరిపి విజయాలు సాధించి వీరశైవ జగతిలో విశిష్టతను పొందారు. శ్రీశైల సూర్య సింహాసనాదీశ్వరులైన శ్రీ వాగీశ పండిత శివాచార్యులు కూడా పండితులు, కవి, విద్వాంసులు అగుటచేత ఎన్నో వీరశైవ గ్రంధాలను ప్రచురించి వెలుగులోకి తెచ్చారు. శ్రీ నిడుదవోలు వెంకటరావు గారు వీరశైవ సాహిత్యానికి ఎంతో గొప్ప సేవ చేశారు-వారి సేవ అనన్యం. శివశ్రీ  ధూపం బసవనాగయ్య గారు వీరశైవ సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయం. శివశ్రీ Dr. K.M. రుద్రప్ప గారు ఎన్నో గ్రంధాలను ప్రచురించి వీరశైవ సాహిత్యంలో ఒక  ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. శివశ్రీ పండిత పెద్దమఠం రాచవీరదేవర గారు కూడా వీరశైవ సాహిత్య వికాసానికే తమ ఆస్తినంతా ధారపోసి ధన్యులైనారు. మరెందరెందరో వీరశైవ సాహిత్య వికాసానికి వేశేష కృషి సల్పారు (వారందరి గురించి ముందు ముందు ప్రత్యేకంగా వివరించగలను).

ప్రస్తుత కాలంలో ఎందరో వీరశైవ సాహిత్యాన్ని వెలుగులోకి తేవడానికి ఎన్నో విధాల కృషి చేస్తున్నారు, అయినా వెలుగు చూసింది చాలా తక్కువే అని చెప్పాలి. శ్రీ కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వరులైన జగద్గురు Dr.చంద్రశేఖర శివాచార్యుల వారు వీరశైవ వికాసానికి చేస్తున్న అపార కృషి అనన్యం. స్వయంగా పండితులగుట చేతనూ, సాహిత్యాభిలాషులగుట చేతనూ ఎన్నో గ్రంధాలను వెలుగులోకి తేవడమే కాకుండా పండితులకు పామరులకు కూడా ఉపయోగపడేలా చేస్తున్నారు. వీరు సాగిస్తున్న వీరశైవ మతోద్దరణ వేశేష శ్లాఘనీయం. భారతదేశమంతటనే గాక పరాయి దేశాల్లోనూ వీరు వీరశైవ మతానికి విశిష్టతను తెస్తున్నారు. మారుతున్న కాలానికనుగుణముగా వెబ్ ప్రపంచంలోనూ వీరశైవాన్ని చాటి చెబుతున్నారు. వీరి మూలకంగానే పరాయి దేశస్థులు కూడా వీరశైవ మతమును స్వీకరించి ఒక website కూడా ఉంచడం విశేషమే (http://veerashaiva.ru).

Veerashaivam - Panchacharya

వీరశై  పంచ పీఠాలు - పంచాచార్యులు 



వీరశైవానికి మూలమైన పంచ పీఠాలు పురాతనత్వాన్ని కలిగి ఉన్నాయి. వేల సంవత్సరాల నుండీ ఆ పీఠాలు కొనసాగుతూవస్తున్నాయి. ఇవి వీరశైవులకు గురు పీఠముల వంటివి. జగతిని సన్మార్గమున నడిపి వారిలో శివభక్తిని పెంపోదించు నిమిత్తము, ఈ మూల పీఠముల యొక్క శాఖలు భిన్న మఠముల పేరున ఎల్లెడలా కలవు. ప్రతి గ్రామములోనూ ఆ శాఖలకు సంబందిచిన మఠములు వెలసి యున్నవి. పూర్వ కాలములో ఈ  మఠముల యందు సర్వసంగ పరిత్యాగులైన, సకల శాస్త్ర  పారంగతులైన వారు పీఠాధిపతులై ఉండేవారు. 


ఇవి పూరతనమని తెలపడానికి పెక్కు చారిత్రిక ఆధారాలు, పలు పురాణ, సాహిత్యాది ఆదారాలు కలవు.

ప్రాచీన ప్రముఖ కవులు శివయోగి శివాచార్య, శ్రీపతి పండిత, మల్లిఖార్జున పండిత, సోమనాథ ఆదిగా గల వారెందరో పంచా చార్యుల కీర్తించి వారి వీరశైవంలో వారి విశిష్టతను తెలియ జెప్పారు.

పంచాచార్య పీఠ చరిత్ర వివరాలు, పీఠ పరంపర ఆచార్యుల వివరములు ఈ క్రింద తెలిపిన వెబ్ సైట్ లలో కలవు :
panchapeeth.com/sri-rambhapuri-peeth.html
panchapeeth.com/sri-ujjaini-peeth.html
panchapeeth.com/sri-kedara-peeth.html 
panchapeeth.com/sri-srishyla-peeth.html

panchapeeth.com/sri-kashi-peeth.html


Thursday, November 6, 2014

Veerashaivam - Sootha Vichaarana

వీరశైవులు - సూతకములు

లింగాదారీ సదా శుచీ అని శాస్త్ర వచనం - అందువలననే వీరశైవులు సూతకాదులు పాటించరు, వాటికి  సంబంధించిన వివరములు.

Devaarchanaadikam Karma Kaaryam DeekshaanvithaiSsadaa !
NaasthyAshoucham Yathastheshaam Soothakam Chethi Nishchitham !!
Shiva Devaarchanam Yasya Yasya Chaagni Parigrah !
Brahmachaari Yatheenaam Cha Shareere Naasthi Soothakam !!  (Soura Puranam Adhyay: 5 Shloka:25, 26)

Na Thasya Soothakam Vatsa Praanalingaanga Sanginah !
Jananottham MruthotthamCha Vidyathe Paramaarthathah !! (Shankara Samhitha, Adhyay:83)


Praarabdha Dheergha Thapasaam Naareenaam YathRajo Bhaveth !
NaThena ThathVratham Thaasaamupahanyetha Karhichith !! (Angeerasa Smruthi-24)

Poundareeke Yathaa Naree Soothakee Va Rajsavalaa !
Raviragniyathaa Vaayuh Koti Koti Gunaa Shucheeh !!
Lingaarchana Tathaa Yaashcha Ruthou Naaryaa Na Soothakam
Thathaa Prasoothikaayashcha Soothakam Naiva Vidhyathe !! (Siddhantha Shikhaamani: Pariccheda: 9)



నిత్యమూ లింగము అంగమున ధరించి అర్చించు వీరశైవునికి జనన మరణాది  సూతకములు ఉండవు.
అంతే గాక ఎల్లపుడూ లింగాదారణ చేసే స్త్రీలకు రాజస్వలాది మైలదోషములు ఉండవు.
లింగాదారణ చేత వీరశైవులు అగ్నివలే పవిత్రులై ఉందురు. కావున  ప్రతినిత్యము స్నానము చేసి శుచియై  లింగ పూజ చేయవలెను అని శాస్త్రములు చెప్పు చున్నవి.

వీరశైవులు పిండారాధన చేయరాదు:
Lingaanga Sanginee Mruthe Saapindyam NaVidheyathe !
Shivalingaanga Yogena Shivabhaavayujah Pituh !!  (Chandrajnaanaagamam, Patalamu-4, Sh-42)
లింగాంగ సంబందమున వీరశైవుడు శివభావమును పొంది యున్నాడు, మృతి నొందిన లింగధారికి  ప్రేతత్వమనేది ఉండదు. అందువలన వీరశైవులు పిండ ప్రదానాదులు చేయరు. చనిపోయిన వారిని లింగైక్యులనే అంటారు, వారి సమాధులపైన ఉంచబడే లింగము-నందికీ కూడా లింగమునర్చించిన మాదిరే అర్చిస్తారు






Wednesday, August 14, 2013

Srikara Bhashyam

 శ్రీకరభాష్యం

బ్రహ్మ సూత్రాలు వీటినే వేదాంత సూత్రాలూ అని అంటారు, వీటిని బాదారాయణుడు చెప్పాడు. బ్రహ్మ సూత్రాలకు భాష్యమును వ్రాసినపుడు ఆయా సిద్దాంతముల వారు వారి వారి సిద్దాంత పరంగా భాష్యము రాసారు.

About Srikara Bhashya

శ్రీపతి పండితాచార్యుడు బ్రహ్మ సూత్రములకు భాష్యము నిర్మించి సంస్కృతమున రచించిన "శ్రీకరభాష్యం" సర్వ శృతి సమన్వయమై వీరశైవ విశేష్టాద్వైత సిద్దాంతాన్ని(శక్తి విశిష్టాద్వైత సిద్దంతము) సిద్ద పరచు చున్నది. దీనిని శక్తి విశిష్టాద్వైత, ద్వైతాద్వైత, శివాద్వైత, విశేష విశిష్టాద్వైత మని కూడా అంటారు. ఈ గ్రంధమున సిద్దాంత శిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోనుటయూ కలదు.  


Sripathi Panditaachaarya

పురాతనుల అందరి మాదిరిగానే శ్రీపతి పండితాచార్యుని జనన కాలం కూడా భిన్నంగా వినిపిస్తున్నాయి.  క్రీ.శ. 960 ప్రాంతమునకు  చెందినవాడు అంటే కొందరు క్రీ.శ.1060 అని మరికొందరు క్రీ.శ.1072 కి చెందినవాడు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నందు గల విజయవాడ అతని స్వస్థలం.  ఇతను అనంత భూపాలుని సభలో శివభక్తులకు సమానమగు వారు లేరని తెలిపి అగ్నిని ఒక పట్టువస్త్రములో మూట కట్టి, పరవాదులకు యాగాదులకు అగ్ని లభించకుండా చేసినట్లు (అగ్నిస్థంబన) చేసినట్టు విజయవాడ మల్లేశ్వరాలయములో ఒక శిలాశాసనము లభించినది.  అంతే గాక ఈ అగ్నిస్థంబన విషయమును మల్లికార్జున పండితుడు తన శివతత్వసారము లోనూ, పాల్కురికి సోమనాథుడు తను రచించిన బసవపురణము లోనూ ప్రస్తుతించారు. 

 
Vijayawada Pallaketha Raja Shila Shaasanam  ("Sripathi Pandithaaraadhya Agnisthambana")

 What is in Srikara Bhashya

(పూజ్య పండిత శ్రీ చిదిరేమఠం వీరభాద్రశర్మ గారి విభూతి - చతుస్సూత్రి/శ్రీకర భాష్యం నుండి యథాతథంగా) 





















Wednesday, July 24, 2013

Siddantha Shikhaamani

సిద్దాంత శిఖామణి

వీరశైవ సిద్దాంతము యొక్క పరమ ప్రామాణిక గ్రంధము సిద్దాంత శిఖామణి:  


వీరశైవ సిద్దాంతమును సంపూర్ణముగా తెలుపు గ్రంధము శివయోగి శివాచార్యునిచే రచించబడిన "సిద్దాంత శిఖామణి" అనే సంస్కృత గ్రంథము.  పంచాచార్యులలో ఒకరైన రేవణ సిద్దుడు, అగస్త్య మహర్షికి భోదించిన వీరశైవ సిద్దాంతమును శివయోగి శివాచార్యుడు ఈ గ్రంధమున వివరించెను.  రేవణ సిద్దుడు (రేణుకాచార్యుడు) భోదించిన సిద్దంతము కాబట్టి దీనిని "రేణుకా గీత", "రేనుకాగాస్త్య సంవాదము" అని కూడా పిలువ బడుతుంది. సిద్దాంతశిఖామణి వీరశైవులకు ధర్మ గ్రంధము వంటిది. వీరశైవుడాచారించ వలసిన పద్దతులను సవివరంగా విశదీకరిస్తుంది. వాటి యందు వివరించబడిన లింగారాధన పద్దతులే వీరశైవ మతమున ఆచరించబడుచున్నవి. 

28 శివాగామముల లోని సారాంశమంతయ చేర్చి తెలుపబదినదే సిద్దాంత శిఖామణి గ్రంధము. ఈ సిద్దాంతమును మించిన శ్రేష్ఠమైన సిద్దాంతము ఇంక లేకుండుటన దీనికి సిద్దాంత శిఖామణి అని పేరు పెట్టబడినది.  సిద్దాంతముల కన్నిటికీ శిరో రత్నమువలె భాసిల్లి శిఖామణి నామమును సార్థకము చేయుచున్నది. దీనిని పటించినవాడు సమస్త శివాగమ సారమును తెలియబడుచున్నవాడగుచున్నాడు. ఇది విరోధిభావనారహిత సిద్దాంతమై శక్తివిశిష్టాద్వైత సిద్దాంతమును ప్రతిపాదించుతూ శిరోమూలకమున  నిలుచుచున్నది. 

సిద్దాంత శిఖామణి గ్రంధకర్త శివయోగి శివాచార్యుడు
శివయోగి శివాచార్యుడు  క్రీ.శ. 900 ప్రాంతమునకు  చెందినవాడు. ఇతను కొలనుపాక వాస్తవ్యుడని కాశీ జగద్గురువులు పండిత చిదిరేమఠం వీరభద్రశర్మ గారు తమ విభూతి మాస పత్రికలో (1943 సంపుటి 6, సంచిక 4) ప్రకటించారు. శివయోగి శివాచార్యుడు తన తండ్రిపేరు సిద్దనాథుడు అని, తాతగారు ముద్దదేవుడని సిద్దాంతశిఖామణిలో  చెప్పుకున్నాడు. 


సిద్దాంత శిఖామణి గ్రంధం శక్తివిశిష్టాద్వైత (వీరశైవ) సిద్దాంతాన్ని ప్రభోదిస్తుంది. ఈ గ్రంధంలో చెప్పబడిన అష్టావరణ, షట్ స్థల, పంచాచార సిద్దాంతాన్ని నేటికీ ఎంతోమంది తమ సంప్రాదాయంలో ఆచరిస్తున్నారు. 


సిద్దాంతశిఖామణి  గ్రంథాన్ని తెలుగులిపిలో శ్రీశైల జగద్గురుపీఠం వారు ప్రచురించారు. అలాగే శ్రీ S.P.బాలసుబ్రహ్మణ్యం గారి స్వరంలో ఆడియో కేసెట్ రూపంలో కూడా తెలుగులో తీసుకువచ్చారు శ్రీశైల జగద్గురువులు. 

తెనాలి సాధనా గ్రంథమండలి వారు మంచి తెలుగు వివరణతో 1960లో  ప్రచురించటం జరిగింది. 

శ్రీ కాశీ జగద్గురు పీఠం వారు తెలుగు వివరణతో 2012లో ప్రచురించటం జరిగింది. ఈ గ్రంధమే తెలుగులో ఇప్పుడు లభ్యంగా ఉన్న గ్రంధం. 


ఈ సిద్దాంత శిఖామణి గ్రంధాన్ని 14 వ శతాబ్దములో వరంగల్, పాల్కురికి గ్రామానికి దగ్గరగల మల్లంపల్లి గ్రామానికి చెందిన చెన్నవెగ్గడ నాగేశ్వర కవి తెలుగులో "సిద్దాంత శైవము" అను పేరున ద్విపద రచన చేశాడు. అది చాలా సరళంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం లభించుట లేదు. ఈ గ్రంధం గూర్చి పండిత చిదిరేమఠం వీరభద్రశర్మ గారు తమ విభూతి మాసపత్రికలో తెలపటం జరిగింది. ఆ తెలుగు ద్విపద సిద్దాంత శిఖామణి ఇలా ఉంది :




సిద్దాంత శిఖామణి గ్రంథ విశిష్టత 
బ్రహ్మ సూత్రములకు భాష్యము నిర్మించి సంస్కృతమున "శ్రీకరభాష్యం" రచించిన శ్రీపతి పండితాచార్యుడు (క్రీ.శ. 960 ప్రాంతమునకు  చెందినవాడు)   తన గ్రంధమున సిద్దాంతశిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోనుటయూ కలదు. శ్రీపతి పండితుడు విజయవాడ శాసనములలో కలడు, అతను సిద్దాంతశిఖామణి గ్రంథమును ప్రస్తావించుటన అతనికి పూర్వమే ఈ గ్రంధము వెలువడినదని, పురాతనమని  చారిత్ర్యక  పరంగానూ  చెప్పవచ్చును. 
శ్రీపత్ పండితుడు తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదాహరించటం జరిగింది.

అలాగే "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అను బ్రహ్మ సూత్ర భాష్యమున కూడా:
"పవిత్రంతే" - ఋగ్వేద మంత్రస్య సిద్దాంత శిఖామణి శ్రీ రేణుకాచార్యేన లింగాధారణ పర్వతేన నిర్దేశిత్ అని 
"రేణుక భగవత్పాద చార్యేణాపి" - పిండతాపిండ విజ్ఞాన మిత్యారభ్యవితాని  శివ భక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః "ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథము ఎంత ఉన్నతమైనది తెలియజెప్పాడు.   
 

"శ్రీకంఠ భాష్య" (బ్రహ్మ సూత్ర భాష్యము) కారులైన శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ భాష్యంలో ఈ సిద్దాంత శిఖామణి శ్లోకములను  ప్రమాణ యుక్తముగా ఉదాహరించుట వలన ఈ గ్రంధ ప్రశస్తి ఎంత గొప్పదో తెలియనగును. 
శ్రీకంఠ శివాచార్యులు తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను బ్రహ్మ సూత్ర భాష్యమున:
సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్ ముక్త శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదాహరించుట జరిగింది. 

ఇంకనూ భట్టోజీ దీక్షితుల (ప్రసిద్ద సిద్దాంత కౌముది కర్త) "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకర భట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక" ,  "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" ఆదిగా గల గ్రంధములలో సిద్దాంత శిఖామణి ప్రమాణముల ఉదాహరించుటచే ఇది జగత్ప్రసిద్ది నొందబడు చున్నది.  

సిద్దాంత శిఖామణిలో ప్రతిపాదింపబడినవిషయములు

సిద్దంతశిఖామణి గ్రంధము శక్తి విశిష్టాద్వైత సిద్దాంతమును విర్దుష్టముగా  ప్రతిపాదించుచూ సుమధురమైన సంస్కృత శ్లోకములచే 21 పరిచ్చేదములతో విలసిల్లు చున్నది. 

ఇందులో తెలుపబడిన విషయములు: 
ఆధ్యాత్మిక విషయములు 
ధార్మిక విషయములు 
యోగ విషయములు 
మత విషయములు
గురుమహాత్మ్య వివరణ
లింగ ధారణము 
భస్మ ధారణము 
రుద్రాక్ష ధారణము 
పంచాక్షరీ మంత్రం విచారము
వర్ణాశ్రమ విచారము 
శక్తి విశిష్టాద్వైత విచారము 
జీవాత్మ పరమాత్మ విచారము 
వర్ణాశ్రమ ధర్మ విచారము  
క్రియా జ్ఞాన సముచ్చయ విచారము 
లింగాంగ సామరస్య విచారము 
శక్తి విచారము 
జగత్సత్యత్వ విచారము
పరిణామవాద విచారము  


ఇందులో 6 సోపానములుగా షట్ స్థల సిద్దాంతము (భక్త, మహేశ, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్య)  పొందుపరచబడినది. ఈ  షట్ స్థల జ్ఞానమే మోక్షమునకు మూలభూతము. 

వీరశైవ సిద్దాంతములో అంగస్థళ, లింగస్థళ అని 2 భేదములు కలవు. అంగస్థళములు - 44,  లింగస్థళములు - 57 కలవు . 5-20 పరిచ్చెదములలొ ఈ మొత్తం 101 స్థళముల యొక్క ప్రమాణ విచారము వివరింప బడినది. 

అంగస్థళములు:
  1. పిండ స్థలము
  2. పిండ జ్ఞాన స్థలము
  3. సంసార హేయ స్థలము
  4. గురు కారుణ్య స్థలము 
  5. లింగ ధారణ స్థలము 
  6. భస్మ ధారణ స్థలము  
  7. రుద్రాక్ష ధారణ స్థలము 
  8. పంచాక్షర జప స్థలము 
  9. భక్త మార్గ క్రియా స్థలము 
  10. ఉభయ స్థలము 
  11. త్రివిధ సంపత్తి స్థలము 
  12. ప్రసాద స్వీకార స్థలము 
  13. సోపాది దాన స్థలము 
  14. నిరుపాది దాన స్థలము 
  15. సహజ దాన స్థలము 
  16. మహేశ్వర ప్రశంసా స్థలము 
  17. లింగ నిష్టా స్థలము 
  18. పూర్వాశ్రయ నిరసన స్థలము 
  19. సర్వాద్వైత నిరసన స్థలము 
  20. ఆహ్వాన నిరసన స్థలము 
  21. అష్టమూర్తి నిరసన స్థలము 
  22. సర్వగత్వ నిరసన స్థలము 
  23. శిల జగన్మయ స్థలము   
  24. భక్త దేహిక లింగ స్థలము 
  25. ప్రసాది స్థలము 
  26. గురుమహాత్మ్య స్థలము 
  27. లింగ మహాత్మ్య స్థలము 
  28. జంగమ మహాత్మ్య స్థలము 
  29.  భక్త మహాత్మ్య స్థలము 
  30. శరణ మహాత్మ్య స్థలము 
  31. ప్రసాద మహాత్మ్య స్థలము 
  32. ప్రాణ లింగి స్థలము 
  33. ప్రాణ లింగార్చన స్థలము 
  34. శివయోగ సమాధి స్థలము 
  35. లింగ నిజ స్థలము 
  36. అంగ లింగ స్థలము 
  37. శరణ స్థలము 
  38. తామస నిరసన స్థలము 
  39. నిర్దేశ స్థలము 
  40. శీల సంపాదన స్థలము  
  41. ఐక్య స్థలము 
  42. ఆచార సంపత్తి స్థలము 
  43. ఏక భాజన స్థలము 
  44. సహభాజన స్థలము 

లింగ స్థళములు:
  1.  దీక్షా గురు స్థలము 
  2. శిక్షా గురు స్థలము 
  3. జ్ఞాన గురు స్థలము 
  4. క్రియాలింగ స్థలము 
  5. భావలింగ స్థలము 
  6. జ్ఞానలింగ స్థలము 
  7. స్వస్థలము 
  8. చార స్థలము 
  9. పర స్థలము 
  10. క్రియాగమ స్థలము 
  11. భావాగమ స్థలము 
  12. జ్ఞానాగమ స్థలము 
  13. సకాయస్థలము  
  14. అకాయస్థలము
  15. పరకాయ స్థలము 
  16. ధర్మాచార స్థలము 
  17. భావాచార స్థలము 
  18. జ్ఞానాచార స్థలము 
  19. కాయానుగ్రహ స్థలము 
  20. ఇంద్రియానుగ్రహ స్థలము 
  21. ప్రాణానుగ్రహ స్థలము  
  22. కాయార్పణ స్థలము 
  23. కరునార్పణ స్థలము 
  24. భావార్పణ స్థలము 
  25. శిష్య స్థలము 
  26. శుశ్రూష స్థలము 
  27. సేవ్య స్థలము 
  28. ఆత్మ స్థలము 
  29. అంతరాత్మ స్థలము 
  30. పరమాత్మ స్థలము 
  31. నిర్దేహాగమ స్థలము 
  32. నిర్భావాగమ స్థలము 
  33. నష్టాగమ స్థలము 
  34. ఆది ప్రసాది స్థలము 
  35. అంత్య ప్రసాది స్థలము 
  36. సేవయ ప్రసాది స్థలము 
  37. దీక్షా పాదోదక స్థలము 
  38. శిక్షా పాదోదక స్థలము 
  39. జ్ఞాన పాదోదక స్థలము 
  40. క్రియానిష్పత్తి స్థలము 
  41. భావనిష్పత్తి స్థలము 
  42. జ్ఞాననిష్పత్తి స్థలము 
  43.  పిండాకాశ స్థలము 
  44. బింద్వాకాశ స్థలము 
  45. మహాకాశ స్థలము 
  46. క్రియాప్రకాశ స్థలము 
  47. భావప్రకాశ స్థలము 
  48. జ్ఞానప్రకాశ స్థలము 
  49.  స్వీకృత ప్రసాది స్థలము 
  50. శిష్టోదన స్థలము 
  51. చరాచరలయ స్థలము 
  52. భాండ స్థలము 
  53. భాజన స్థలము 
  54. అంగాలేప స్థలము 
  55. స్వపరాజ్ఞ స్థలము 
  56. భావాభావ లయ స్థలము 
  57. జ్ఞాన శూన్య స్థలం 

చివరగా శివైక్య స్థలము తెలుప బడినది.  

ఈ గ్రంధమును చదివిన వారు సంపూర్ణ జ్ఞానముచే మోక్ష ప్రాప్తి నొందుట తథ్యము.